: ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి బీజేపీ నేతల క్యూ!
బీజెపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ శుక్రవారం ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తరువాత ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సెక్రటరీ భయ్యాజీ జోషీలను కలిశారు. అనంతరం ఆ పార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరుగా ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారు. మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ వారిని కలవగా, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ రేపు కలవనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఈ నెల 11న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలను కలవనున్నారు. కాంగ్రెస్ మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు చేస్తోందన్న ఊహాగానాలతో అప్రమత్తమైన బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.