: కేసీఆర్ చంపేయిస్తాడేమో : రమ్య
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని అతని అన్న కుమార్తె రమ్య ఆరోపించింది. గతంలో టీఆర్ఎస్ ను విభేదించినందుకు ఆ పార్టీ కార్యకర్తలు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని తెలిపింది. టీఆర్ఎస్ నేత చింతా స్వామితో కలిసి సీఎం ను కలిసిన ఆమె, కార్యకర్తల ముసుగుతో కేసీఆర్ తమను చంపేయిస్తాడేమోనని అనుమానం వ్యక్తం చేసి, తమకు రక్షణ కల్పించాలని కోరారు. త్వరలో డీజీపీ దినేష్ రెడ్డిని కలిసి రక్షణ కల్పించాల్సిందిగా కోరనున్నామని తెలిపారు. వేయి డప్పులు.. లక్ష చెప్పుల్లో తన చెప్పు కూడా ఉంటుందని ప్రకటించినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు రమ్య ఫంక్షన్ హాలుపై దాడికి దిగిన సంగతి తెలిసిందే.