: పాక్ స్పిన్నర్ పై జీవితకాల నిషేధం
పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ డేనిష్ కనేరియాపై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) జీవితకాలం నిషేధం విధించింది. పాకిస్థాన్ క్రికెట్లో ముస్తాక్ అహ్మద్ వారసుడిగా అరంగేట్రం చేసిన కనేరియా పాక్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన హిందూ. వివాదాస్పద బౌలర్ అంటూ పలుమార్లు అతనిపై ఆరోపణలు చెలరేగినా, పరీక్షలకు తట్టుకుని నిలబడి మేలైన స్పిన్నర్ నని కనేరియా నిరూపించుకున్నాడు. అయితే 2009లో ఇంగ్లాండ్ లో జరిగిన కౌంటీల్లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేలడంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటీల్లో కనేరియా స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అప్పీలు చేశాయి. దీంతో ఐసీసీ, పీసీబీ కరప్షన్ కోడ్ క్రింద కనేరియాపై జీవితకాలం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా నిర్ణయంపై స్పందించేందుకు కనేరియా అందుబాటులోకి రాలేదు.