: రోడ్ మ్యాప్ ఇవ్వండి, నిర్ణయం చెబుతాం: దిగ్విజయ్
తెలంగాణ అంశంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, పరిశీలించి నిర్ణయం చెబుతామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తేల్చిచెప్పారు. ఈ విషయమై ఓ నివేదిక ఇవ్వాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణలకు దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఆ రోడ్ మ్యాప్ ఆధారం సోనియా గాంధీ, ఇతర హైకమాండ్ నేతలు తెలంగాణ అంశంపై ఓ అంచనాకు రాగలరని డిగ్గీ రాజా చెప్పారు. ఈ సీనియర్ నేత నేడు రాష్ట్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి రఘువీరారెడ్డి కూడా దిగ్విజయ్ ను కలిశారు.