: వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో పేషెంట్ మృతి


బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న 25 ఏళ్ల రాజేశ్వరిని బెంగళూరులోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించగా.. వైద్యులు 'ఒ' పాజిటివ్ గ్రూపు బ్లడ్ అవసరమని ఆమె భర్తకు చెప్పారు. బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్ ఇచ్చిన రక్తాన్ని ఎక్కించిన అనంతరం రాజేశ్వరి పరిస్థితి విషమించి మరణానికి దారి తీసింది. అయితే, టెక్నీషియన్ ఇచ్చిన బ్లడ్ యూనిట్ పై 'ఒ' పాజిటివ్ అనే ఉంది. కానీ, అది 'బి' పాజిటివ్ గ్రూపు రక్తం అని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. తన భార్యను పొట్టనబెట్టుకున్న ఆస్పత్రిపై రాజేశ్వరి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యుడు, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News