: జగన్ ను జైలుకు పంపే క్రమంలో మోపిదేవిని బలిచేశారు: విజయమ్మ


మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబసభ్యులు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్ ను జైలుకు పంపే క్రమంలో మోపిదేవిని బలిపశువును చేశారని అన్నారు. మోపిదేవిని అరెస్టు చేసేముందు వారంరోజుల్లో బయటికొస్తారని ప్రభుత్వం చెప్పిందని, అవన్నీ ఒట్టిమాటలే అని నిరూపితమైందని ఆమె ఆరోపించారు. వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విశ్వాసఘాతుకానికి పాల్పడిందని విమర్శించారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి అప్రదిష్ఠ పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలు ప్రజల దృష్టిని దాటిపోవని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News