: బీసీ అయినందునే కక్షగట్టి జైలుకు పంపారు: మోపిదేవి సోదరుడు


తాము బీసీలమైనందునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కక్షగట్టి తమ సోదరుడు మోపిదేవి వెంకట రమణను జైలుకు పంపించారని హరినాథ్ బాబు ఆరోపించారు. మోపిదేవి కుమారుడు రాజీవ్, అనుచరులతో కలిసి హరినాథ్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో విజయలక్ష్మి సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. అంతకుముందు హరినాథ్ బాబు మీడియాతో మాట్లాడారు. సోదరుడు వెంకటరమణకు న్యాయ సహాయం అందించే విషయంలోనూ సీఎం వివక్ష చూపించారన్నారు. 25ఏళ్లుగా కాంగ్రెస్ కు సేవ చేస్తే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News