: ఆర్మీ జవాను కుటుంబానికి చంద్రబాబు ఆర్ధిక సాయం
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను వినాయగం కుటుంబానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేయూతనందించారు. వినాయగం కుటుంబాన్ని నేడు పరామర్శించిన బాబు వారికి రూ.5 లక్షల ఆర్ధికసాయం అందించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిన్నబండపల్లి వినాయగం స్వగ్రామం.