: సీమాంధ్ర ప్యాకేజీ కోసం బీజేపీ డిమాండ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న బీజేపీ అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో నష్టపోకుండా, లబ్ధి పొందే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. 50 ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిన సీమాంధ్రకు విభజన కంటే ముందే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఈ రోజు డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనపై గుంటూరులో బీజేపీ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. విశాఖపట్నం, విజయవాడ పెద్ద నగరాలైనప్పటికీ వాటిని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయలేదని, సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ అధ్యక్షుడు రఘునాథ బాబు ఆరోపించారు.