: కాల్పుల్లో గాయపడ్డ గంటి ప్రసాదం మృతి
మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ గౌరవాధ్యక్షుడు గంటి ప్రసాదం కన్నుమూశారు. నిన్న నెల్లూరులో గంటి ప్రసాదాన్ని కొందరు దుండగులు కత్తితో పొడిచి ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. విరసం సభలకు హాజరై బంధువుల ఇంటికి వెళ్ళే క్రమంలో ఆయనపై దాడి జరిగింది. కాగా, తీవ్రగాయాలపాలైన ప్రసాదం.. నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉదయం నెల్లూరు చేరుకున్నారు.