: బీరు కొడితే జోరే!
రోజూ కొంత బీరు తాగితే రోజంతా జోరే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజూ ఒక అరలీటరు బీరు తాగితే చాలు ఆరోగ్యంగా ఉంటారనే విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. బీరు సేవనం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.
గ్రీస్ శాస్త్రవేత్తలు రోజుకో అరలీటరు బీరు తాగడం వల్ల గుండె చుట్టూ ఉండే రక్తనాళాల పరిస్థితి బాగా మెరుగవుతుందని, దీనివల్ల రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెబుతున్నారు. బీరు సేవనం వల్ల ధమనులు మరింత మృదువుగా మారుతాయని, రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందని వీరి అధ్యయనంలో వెల్లడైంది. 400 మి.లీ. బీరు తాగిన తర్వాత రెండు గంటల్లో దమనులు మరింత మెత్తగా మారడంతోబాటు రక్తప్రసరణ బాగా మెరుగుపడిన విషయాన్ని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. అయితే ఆల్కహాల్ లేని బీరు తాగితే ఇలాంటి ప్రభావం ఉండదని, ఆల్కహాల్ కలిగివున్న బీరు తాగితేనే రక్తప్రసరణ మెరుగవుతుందని, బీరులోని ఆల్కహాల్, యాంటీ ఆక్సిడెంట్ల సమ్మేళనం వల్ల ఈ ఫలితాలు వచ్చి ఉంటాయని వారు చెబుతున్నారు.