: మూలకణాలతో మరో సృష్టి!


మూలకణాలతో పలు వ్యాధులకు చికిత్సలు చేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. వైద్య విధానంలో మూలకణాల చికిత్స ప్రస్తుతం బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో మూలకణాలతో కాలేయ కణజాలాన్ని కూడా సృష్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇది ప్రపంచంలోనే ప్రథమం అని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యోకోహామా సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన టకనోరీ టకేబే, హిడేకి టనిగుచి అనే శాస్త్రవేత్తలు హ్యూమన్‌ ఇండ్యూస్డ్‌ ప్లూరీపోటెంట్‌ స్టెమ్‌సెల్స్‌ (హైపీఎస్‌సీ) నుండి రక్తనాళాలతో కూడిన పూర్తిస్థాయిలో పనిచేసే మానవ కాలేయాన్ని సృష్టించవచ్చని నిరూపించారు. తాము సాధించిన విజయం వల్ల కాలేయ దాతల కొరతను అధిగమించవచ్చని వారు భావిస్తున్నారు. అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న వారికి అవయవ బుడిపెలను (ప్రాథమిక దశలోని అవయవాలు) మార్పిడి చేయడం ప్రత్యామ్నాయ విధానంగా ఉపయోగపడగలదని ఈ విషయాన్ని ఈ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రదర్శించారు.

సాధారణంగా కాలేయం ఏర్పడే తొలిదశలో కాలేయం మూలకణాలు పేగుల పైభాగం నుండి విడిపోయి కాలేయం ఆకారంలో బుడిపెగా రూపుదిద్దుకుంటాయి. తర్వాత ఇందులో నుండి రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీని ఆధారంగానే పరిశోధకులు హైపీఎస్‌సీలతో కాలేయాన్ని సృష్టించారు. ఇలా సృష్టించిన కాలేయ బుడిపె మార్పిడి చేసిన 48 గంటల్లోనే రక్తనాళాలతో కూడిన కాలేయ బుడిపెగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News