: ధనుష్ సినిమాను నిషేదించిన పాకిస్థాన్


సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తూ నటించిన సూపర్ హిట్ సినిమా 'రాన్ జానా'ను పాకిస్థాన్ నిషేధించింది. సినిమా కథ వివాదాస్పదంగా ఉందంటూ పాకిస్థాన్ సెన్సార్ బోర్డు సోనమ్ కపూర్, ధనుష్, బాబీడియోల్ నటించిన ఈ సినిమాకు నో చెప్పింది. గతంలో కూడా సినిమా కధలు వివాదాస్పదంగా ఉన్నాయంటూ ఏక్ థా టైగర్, ఏజెంట్ వినోద్, జీఐ జో సినిమాలను నిషేధించింది. కధలో వారికి అభ్యంతరంగా కనిపించిన విషయమేంటంటే ముస్లిం యువతి ఇద్దరు హిందూ యువకులతో ప్రేమలో పడడం!

  • Loading...

More Telugu News