: 21న ఘనంగా మాతృభాషా దినోత్సవం: మండలి బుద్ధ ప్రసాద్
ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర అధికార భాషా సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 21న మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ ఈ రోజు హైదరాబాదులో తెలిపారు.
మాతృభాషనే మాట్లాడతామనీ, ఇతర కార్యకలాపాల్లో తప్పకుండా మాతృభాషనే ఉపయోగిస్తామనీ ఆ రోజు అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అంతేకాకుండా, తెలుగును పాలనాభాషగా అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న అధికారులను, నల్గొండ, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను మాతృభాషా దినోత్సవం రోజున సత్కరించి, పురస్కారాలు అందజేస్తామని బుద్ధ ప్రసాద్ చెప్పారు.
మాతృభా