: అమెరికాలో తాత ముత్తాతల పరువు నిలబెట్టిన ఎన్నారై చిన్నారులు


అమెరికాలో ప్రవాసభారతీయ చిన్నారులు తమ తాతముత్తాతలైన నలభీముల పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేశారు. అమెరికా జాతీయ స్థాయిలో నిర్వహించిన పాకశాస్త్ర పోటీల్లో ఐదుగురు భారతీయ బాలలు అత్యంత ప్రతిభ చూపి సత్తా చాటారని యూఎస్ అధ్యక్షభవనం వైట్ హౌస్ ఓ ప్రకటనలో అభినందించింది. ప్రతిభ చూపిన వారిలో ఫాల్ మౌత్ కు చెందిన షిఫాలీ సింగ్, నార్త్ కరోలినా ఛాపెల్ హిల్ కు చెందిన విజయ్ డే, ఓహియోకు చెందిన అనీష్ పటేల్, పెన్సిల్వేనియా కు చెందిన గణేష్ సెల్వకుమార్, టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ నివాసి దేవనాషి ఉదేశి వున్నారు.

వీరంతా మంగళవారం వైట్ హౌస్ కిచెన్ గార్డెన్ లో జరుగనున్న స్టేట్ డిన్నర్ స్పెషల్ ప్రోగ్రాంలో మిషెల్ ఒబామా చేతుల మీదుగా పురస్కారాలు అందుకుని, విందారగిస్తారు. ద హెల్దీ లంచ్ టైం ఛాలెంజ్ అండ్ ఎంప్ సంస్థ గత ఏడాది నుంచి చిన్నారులకు ఈ పోటీలు నిర్వహిస్తోంది. తనకు అత్యంత ఇష్టమైన పోటీవిజేతలతో జరిగే డిన్నర్ కోసం ఎదురు చూస్తున్నానని మిషెల్ తెలిపారు. ఈ విందులో విజేతలు తమ తల్లిదండ్రులు, సంరక్షకులతో కలిసి పాల్గొంటారు.

  • Loading...

More Telugu News