: ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడు అడ్లీ మన్సూర్


ఏడాదిగా చెలరేగిన ఈజిప్టు అల్లర్లకు తెరపడనుంది. తాజాగా సైన్యం అడ్లీ మన్సూర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. తొలుత సైన్యం పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందంటూ ప్రజలు రోడ్లెక్కారు. అల్లర్లు చేశారు. సైన్యం కాల్పులకు ఎదురొడ్డారు. ఎప్పటికీ అల్లర్లు చల్లారకపోవడంతో దిగివచ్చిన సైన్యం ఎన్నికలు నిర్వహించింది. మళ్లీ ఆరునెలల తరువాత ప్రజల చేత ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు పెద్దఎత్తున అల్లర్లకు దిగారు. భారీ స్థాయి ప్రదర్శనలు, ర్యాలీలు, సమావేశాలతో ఈజిప్టు రాజధాని కైరోను వేడెక్కించారు. దీంతో సైన్యం అతన్ని పదవి నుంచి తొలగించింది. అనంతరం కైరో కాన్సిట్యూషనల్ కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న అడ్లీ మన్సూర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.

  • Loading...

More Telugu News