: పది జిల్లాల తెలంగాణే మాక్కావాలి: జేఏసీ
తెలంగాణ అంశంపై రాజకీయ జేఏసీ నేడు ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణే తమకు అంగీకారమని ఆ భేటీలో పాల్గొన్న నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఓ వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్ని రాజకీయపార్టీలను కలుపుకుని పోవాలని జేఏసీ నేతలు నిశ్చయించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ నేత దత్తాత్రేయ, టీఆర్ఎస్ నాయకులు కేకే, వివేక్ తదితరులు హాజరయ్యారు.