: నెల్లూరులో కాల్పుల కలకలం
మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ గౌరవాధ్యక్షుడు గంటి ప్రసాద్ పై కాల్పులు జరిగాయి. నెల్లూరులో జరుగుతున్న విప్లవ రచయితల సంఘం సభకు హాజరైన ప్రసాద్ పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో, ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విరసం సభకు హాజరై బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. తొలుత కత్తితో పొడిచి ఆ తర్వాత మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.