: ట్విట్టర్లో మోడీయే మొనగాడు
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఖాతాలో మరో ఘనత చేరింది. టెక్నాలజీ వినియోగంలో దేశంలోని రాజకీయనేతలందర్లోకి అగ్రగణ్యుడని పేరు తెచ్చుకున్న మోడీ ట్విట్టర్ ఫాలోయర్స్ విషయంలోనూ నెంబర్ వన్ గా నిలిచాడు. మోడీని ట్విట్టర్లో 18,26,055 మంది అనుసరిస్తున్నారట. ఇప్పటి వరకు ఈ విషయంలో టాప్ లేపిన కేంద్రం మంత్రి శశి థరూర్ 18,21, 776 మంది ఫాలోవర్స్ తో రెండోస్థానానికి పడిపోయాడు. ఇక మోడీ బీజేపీ సహచారిణి సుష్మా స్వరాజ్ 5,23, 336 ఫాలోయర్స్ ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ను 4,12,289 మంది అనుసరిస్తున్నారట.