: రాయలసీమను పంచడానికి సోనియా ఎవ్వరు?: బైరెడ్డి
తెలంగాణ అంశాన్ని పరిష్కరించేందుకుని రాయలసీమను ముక్కలు చేయాలని చూస్తే ఊరుకోబోమని బైరెడ్డి రాజశేఖరెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంతాన్ని విడగొట్టే హక్కు సోనియాకు లేదని ఆయన మండిపడ్డారు. నేడు ఇందిరాపార్కు వద్ద రాయలసీమ వాసుల ఆధ్వర్యంలో 52 గంటల దీక్ష కొనసాగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి.. రాష్ట్రాన్ని శాసించగల కీలక నేతలు రాయలసీమలో ఉన్నా.. ప్రస్తుత తరుణంలో ఎవరూ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.