: సీమాంధ్రులంతా జగన్ వైపు మళ్ళారు: పాల్వాయి
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఇప్పుడు ఏమంత బలంగా లేదని అంటున్నారు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి. ఢిల్లీలో ఆయన నేడు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో సమైక్య ఉద్యమంలో ఇప్పుడు విద్యార్థులు, ప్రజలు ఎవరూ లేరని, వారందరూ తాజాగా జగన్ కు జై కొడుతున్నారని అన్నారు. తెలంగాణలో మాత్రం జనమంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మూడు వారాల్లో తెలంగాణ తథ్యమని పాల్వాయి ధీమా వ్యక్తం చేశారు.