: తెలంగాణపై తేల్చేద్దాం.. రౌండ్ టేబుల్ మీటింగ్ కు రండి: కోదండరాం
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సంఘం కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యేక రాష్ట్రం విషయమై అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా కోదండరాం పార్టీలను రౌండ్ టేబుల్ మీటింగ్ కు ఆహ్వానించారు. అయితే, ఉద్యమంలో ప్రాబల్యం కోసం తహతహలాడే టీఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండానే కోదండరాం ఈ ప్రయత్నానికి ఒడిగట్టడం రాజకీయవర్గాలను ఆలోచనలో పడేస్తోంది.