: వరద నేపథ్యంలో కళ్ళు చెమ్మగిల్లే వాస్తవం..!
ఉత్తరాఖండ్ వరదల్లో ఇప్పటివరకు 1,227 మంది చిన్నారుల ఆచూకీ తెలియరాకపోవడం విచారం కలిగిస్తోంది. కొద్దివారాల క్రితం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన జలప్రళయం అక్కడ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో విషాదఛాయలు మిగిల్చింది. కాగా, ఈ విపత్తు కారణంగా వెయ్యి మందికి పైగా చిన్నారులు గల్లంతయ్యారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం ప్రతినిధులకు వివరించారు. ఈ మేరకు బాలల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదు చేశారని సుభాష్ కుమార్ తెలిపారు. ఓ నెలలోపు ఈ చిన్నారుల ఆచూకీ లభ్యం కాకపోతే వారు చనిపోయినట్లు ప్రకటిస్తామని పేర్కొన్నారు.