: బ్యాక్టీరియా జబ్బులకు ఒకే మందు!


క్షయతోబాటు బ్యాక్టీరియా వల్ల వచ్చే వివిధ జబ్బులకు ఒకే మందుతో చెక్‌ చెప్పాలని ఆష్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. బ్యాక్టీరియా వల్ల పలు రోగాలు వస్తున్నాయి. అయితే ఒక్కో వ్యాధికి ఒక్కో రకమైన మందులను ఉపయోగిస్తున్నాము. అలా కాకుండా కొత్త రకం యాంటీ బయోటిక్‌ మందును రూపొందించేందుకు ఆష్ట్రేలియా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఈ కొత్త రకం యాంటీబయోటిక్‌ మందు క్షయతోబాటు బ్యాక్టీరియా మూలంగా వచ్చే వివిధ జబ్బులను సమర్ధవంతంగా తగ్గించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం యాంటీబయోటిక్స్‌ కేవలం బ్యాక్టీరియా కణాల పైపొర లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే ఈ కొత్తరకం మందు బ్యాక్టీరియా మనుగడకు కీలకమైన ఎంజైమును అంటుకుని ప్రోటీన్‌ నిరోధకంగా కూడా పనిచేస్తుందని అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ఆండ్రూ బెల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News