: కాశ్మీర్ లో పోలీసులపై కాల్పులు... ఛిద్రమైన చొరబాటుదారు శరీరం
జమ్మూ కాశ్మీర్ పోలీసులపై నియంత్రణ రేఖ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. ఓ చొరబాటుదారు అక్రమంగా భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు అతనిని కాల్చిచంపాయి. ఈ ఘటనలో చొరబాటుదారుడు తన శరీరానికి అమర్చుకున్న గ్రెనేడ్లు పేలిపోవడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. దీంతో అతని శరీరం ఆనవాళ్లను కాశ్మీర్ పోలీసులు సేకరించి వెనుదిరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో పోలీసులెవరూ గాయపడలేదు.