: అమెకన్ల నెట్ కాపురం
అమెరికాలో నెట్ తో ఎక్కువ సమయం గడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. నెట్ లో గడపడంతోనే అమెరికన్లకు వారంలో ఒక రోజు గడిచిపోతోందని ఒక పరిశోధన వెల్లడించింది. మెయిల్స్ చూడడం, సందేశాలు పంపడం, ఛాటింగ్ చేయడం, సామాజిక సైట్లలో విహారంలోనే 23 గంటలు గడిచిపోతున్నాయని ఆ పరిశోధన తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది సాంకేతిక పరికరాల వినియోగాన్ని తగ్గించుకున్నట్లు తెలిపారు. వ్యక్తులతో ప్రత్యక్ష సంప్రదింపులపై ఆసక్తి కనబరుస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ వీరంతా వారంలో 8 గంటలు ఈ మెయిల్స్ కోసం వెచ్చిస్తుండగా ఏడు గంటలు ఫేస్ బుక్ లో, అయిదు గంటలు యూట్యూబ్ లో విహరిస్తున్నట్టు సర్వేలో తెలిపారు. దీంతో వీరు నెట్ తోనే కాపురం చేస్తున్నట్టుందని సదరు సర్వే వ్యాఖ్యానించింది.