: కోహ్లీ కెప్టెన్సీపై 'నో కామెంట్' అంటోన్న గంభీర్


విండీస్ గడ్డపై టీమిండియా వరుస ఓటములపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ధోనీకి గాయం నేపథ్యంలో తాత్కాలిక సారథ్యం వహిస్తోన్న ఢిల్లీ సహచరుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వ్యాఖ్యానించడానికి గంభీర్ నిరాకరించాడు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మాంచి ఫామ్ లో ఉన్న భారత జట్టు ఇప్పుడిలా ఢీలా పడడానికి అలసట కారణం కాదని అన్నాడు. అలాగైతే అన్ని జట్లు ఈ సమస్య ఎదుర్కోవాలి కదా? అంటూ.. శ్రీలంక జట్టును ఉదహరించాడు. లంకేయులు మన జట్టుకన్నా ఎక్కువ క్రికెటే అడుతున్నారని గుర్తు చేశాడు.

ముక్కోణపు టోర్నీలో భాగంగా నిన్న లంక చేతిలో 161 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ.. ఇలాంటి పరిణామాలు ఏ క్రీడలోనైనా జరుగుతుంటాయని.. ఎల్లప్పుడూ విజయాలను ఆశించడం సరికాదని, ఓటములూ ఆటలో భాగమే అని వివరించాడు.

  • Loading...

More Telugu News