: ఇది భారత దేశం, ఏం జరుగుతుందో నాకు తెలుసు: జియాఖాన్ తల్లి
ఇది ప్రజాస్వామిక భారత దేశమని, తన కుమార్తె కేసు ఏ మూలకు చేరుతుందో తనకు తెలుసని బాలీవుడ్ దివంగత నటి జియాఖాన్ తల్లి రబియా ఖాన్ అన్నారు. నేనేదో ఆరోపణలు చేస్తున్నానని అంటున్న వారంతా నా కుమార్తెను తిరిగి తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నిచారు. తానేమీ పనిలేక ఆరోపణలు చేయడం లేదని, తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని అన్నారు. ఇక్కడితో తాను ఆగనని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలపై పంచోలీ కుటుంబం పరువునష్టం దావా వేస్తానందన్న ప్రశ్నకు 'వేసుకోనివ్వండి, వారేం చేయగలరో చేసుకోనివ్వండి, నేను మీడియా ద్వారా పోరాడను. నేను కూడా ఏం చేయగలనో అదే చేస్తా'నని సూటిగా సమాధానమిచ్చారు. తన భవిష్యత్ కార్యాచరణను తాను నిర్ణయించుకోగలనని ఘాటుగా స్పందించారు. మరోవైపు రబియా ఖాన్ పై పలు వార్తలు మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.