ap7am logo

ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ.. తెలుసుకునేది ఎలా?

Sun, May 14, 2017, 12:36 PM
Related Image

ఉద్యోగ అవకాశాలు ఏ ఏ రంగంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. మనకు తగిన ఉద్యోగావకాశం ఏ కంపెనీలో ఉంది..?  ప్రభుత్వ ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ల సమాచారాన్ని ఎక్కడ తెలుసుకోవాలి..? అసలు చదువు పూర్తయిన తర్వాత జాబ్ పట్టేది ఎలా..? తెలుసుకుందాం పదండి. 

జాబ్ ప్లేస్ మెంట్ సేవలు అందుబాటులో ఉన్న కాలేజీలు, క్యాంపస్ రిక్రూట్ మెంట్లు నిర్వహించే కళాశాలల్లో అడ్మిషన్ సంపాదించడం ద్వారా...  కోర్సు చివరిలో కంపెనీలు నిర్వహించే రిక్రూట్ మెంట్ లలో ప్రతిభ చూపి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇది సులువైన పద్ధతి. ఈ సదుపాయాన్ని పొందలేని వారు ఉద్యోగ వేట మొదలు పెట్టాల్సిందే.  

representational imageఈ రోజు మార్కెట్లో బోలెడన్ని జాబ్ సైట్లు ఉన్న విషయం తెలుసుకదా. వాటిలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని చక్కని రెజ్యుమే పోస్ట్ చేయడం ముందుగా చేయాల్సిన పని. రెజ్యుమే రాయడం ఓ కళ. చక్కగా రాసేందుకు పాటించాల్సిన సూచనల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. రెజ్యుమే స్వయంగా రాయలేకుంటే జాబ్ సైట్సే కొంత మొత్తం తీసుకుని ఆ పని చేసి పెడతాయి. ఒక్కసారి రెజ్యుమే పోస్ట్ చేయడం ఆలస్యం విద్యార్హతలకు తగిన రంగాల్లోని ఉద్యోగావకాశాల సమాచారాన్ని అవి మెయిల్, మొబైల్ కు పంపిస్తాయి. సైట్ లో లాగిన్ అయి అప్లయ్ చేసుకోవచ్చు. లేదా నేరుగా సైట్ లో లాగిన్ అయి జాబ్స్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. 

అంతేకాదు, ఎంప్లాయర్లు (కంపెనీల నిర్వాహకులు) తమకు కావాల్సిన మ్యాన్ పవర్ (ఉద్యోగులు) కోసం జాబ్ సైట్స్ ను ఆశ్రయిస్తుంటాయి. అక్కడ ఉంచిన వేలాది మంది అభ్యర్థుల రెజ్యుమేల నుంచి అర్హతలున్న వారి రెజ్యుమేలను సెలక్ట్ చేసి వారికి రిక్రూటర్లు కాల్ చేస్తారు. ఫోన్ కాల్ లో సీటీసీ, సమ్మతి తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేస్తారు. లేదా రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కూడా చేయవచ్చు. సత్తా చూపితే జాబ్ గ్యారంటీ. 

జాబ్స్ కెరీర్ సైట్స్

http://www.naukri.com/

http://www.monsterindia.com/

http://www.timesjobs.com/

https://www.freshersworld.com/

http://www.placementindia.com/

http://www.ragns.com/

https://mettl.com/met/

http://www.careerbuilder.co.in/

http://www.clickjobs.com/

https://www.glassdoor.co.in/index.htm

http://www.findtherightjob.com/

http://www.jagranjosh.com/

http://www.eenadupratibha.net/

http://sakshieducation.com/Home.html

http://www.recruitmentform.co.in/private-jobs

http://www.placementpoint.com/

http://www.shine.com/

http://www.jobsahead.com/

http://www.babajob.com/

http://www.indeed.co.in/

https://www.fresherslive.com/

http://www.firstnaukri.com/

http://www.freejobalert.com/

http://www.freshersopenings.in/

విదేశాల్లో ఉద్యోగావకాశాలకు

http://www.jobsdb.com/

http://www.naukrigulf.com/

http://ae.timesjobs.com/

http://www.employmentguide.com/

http://www.monster.com/

https://www.gulftalent.com/

https://jobsindubai.com/Default.asp

ప్రభుత్వ ఉద్యోగి కావాలంటే వీటిని ఫాలో అవ్వాల్సిందే... 

http://www.employmentnews.gov.in/

http://www.careerlic.in/

http://www.sarkarinaukriblog.com/

http://www.govtjobs.co.in/

http://www.indgovtjobs.in/

http://www.freejobalert.com/

http://www.sarkari-naukri.in/

http://egovtjobs.in/

https://www.sarkariexaam.com/

http://indiatoday.intoday.in/education/

http://www.mysarkarinaukri.com/

http://www.govtjobs.allindiajobs.in/

https://www.sarkariexaam.com/

ఇవే కాదు ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీకి వెబ్ సైట్ నేడు తప్పకుండా ఉంటోంది. గూగుల్ ద్వారా ఆ వెబ్ సైట్ యూఆర్ఎల్ అడ్రస్ లకు వెళ్లి కెరీర్ సెక్షన్ నుంచి ఉద్యోగ అవకాశాల సమాచారం తెలుసుకోవచ్చు. 

దినపత్రికలను విడిచిపెట్టవద్దు

representational imageప్రముఖ జాతీయ, ప్రాంతీయ దిన పత్రికలను క్రమం తప్పకుండా నిత్యం పరిశీలించడం ద్వారా ప్రభుత్వ రంగ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, కార్పొరేట్ కంపెనీల నోటిఫికేషన్ల సమాచారాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో వారిని మెప్పించగలిగితే జాబ్ ఆఫర్ లెటర్ చేతిలో పడినట్టే. ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక కూడా అందుబాటులో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచార పత్రిక. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఎకనమిక్ టైమ్స్, ఇండియన్ టైమ్స్, హిందూస్థాన్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ ఇవి తప్పనిసరిగా చూడాల్సిన జాతీయ దిన పత్రికలు. 

సీనియర్లను వాడుకోండి

మీరు చదివిన డిగ్రీ కళాశాలలో మీకంటే ముందే చదివి ప్రస్తుతం మంచి జాబ్స్ లో సెటిల్ అయిన వారి కాంటాక్ట్ నంబర్లను తెలుసుకోండి. వారిని ఒకసారి కలసి రెజ్యుమే కాపీ ఇచ్చి సహకారాన్నికోరండి. వారు చేస్తున్న కంపెనీ లేదా వారి స్నేహితులు చేస్తున్న కంపెనీలో  ఓపెనింగ్స్ ఉంటే మీ రెజ్యుమేను ఫార్వార్డ్ చేయమని కోరండి. రిఫరెన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి. ఇక స్నేహితులు, బంధువులు, ఇరుగిల్లు, పొరుగింట్లో ఉండేవారిలో మంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని సైతం కలసి ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని రికమెండ్ చేయమని కోరండి. 

కన్సల్టెన్సీలు

జాబ్ కన్సల్టెన్సీలు, ఏజెంట్ల సహకారం సైతం తీసుకోవచ్చు. ఉద్యోగ అన్వేషణకు పట్టణాలు, నగరాలు అనువుగా ఉంటాయి. పల్లెల్లో ఉన్నవారు పట్టణ బాట పట్టి వేట ప్రారంభించవచ్చు. ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపై భారం వేయకుండా పార్ట్ టైమ్ జాబ్ చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. మంచి పేరున్న కన్సల్టెన్సీల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవకాశాలున్నప్పుడు పిలుపు అందుతుంది. 

సెమినార్ల వల్ల ప్రయోజనమే

జాబ్ ఫెయిర్, సెమినార్లకు హాజరవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఫెయిర్ కు హాజరై మీ విద్యార్హతకు సరిపడా ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ఒక్క ప్రయత్నంతోనే ఉద్యోగం వచ్చేస్తుందని కాదు. ఒకవేళ తొలి ప్రయత్నంలో రాకపోయినా తదుపరి ప్రయత్నంలో అయినా ఉద్యోగాన్ని సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, కిటుకులేవో తెలుసుకోవచ్చు. representational image

ఇంటర్వ్యూ ను హైజాక్ చేయాలి

ముఖ్యంగా సాధారణంగా ఇంటర్వ్యూల్లో ఎదురయ్యే ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి చెప్పండని అడిగితే ఎక్కువ మంది పేరు, తండ్రి పేరు, ఊరి పేరు, విద్యార్హతలు తెలియజేస్తుంటారు. ఇవి చెప్పకూడదని కాదు. చెప్పండి చాలా క్లుప్తంగా. వీటితోపాటు మీలో నైపుణ్యాలు, విజయాలను సాధించగల సత్తా, బాధ్యతలు అప్పగిస్తే ఏం చేసి చూపించగలరు, ఇలాంటి వాటి గురించి తప్పక తెలియజేయండి. నిజానికి ఈ ప్రశ్న ఉద్యోగార్థికి పన్నీరు వంటిది. మీకు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి మధ్య చక్కని సంభాషణ ఈ ప్రశ్నతోనే ప్రారంభం కావచ్చు. అందుకే బీ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్. ఇందుకోసం ఆన్ లైన్ లో వెతికితే బోలెడు సమాచారం లభిస్తుంది. 

ఓ జాబ్ కోసం ఫలానా కంపెనీ నుంచి కాల్ వస్తే ముందు ఆ కంపెనీ చరిత్ర, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం, స్థాపకులు ఇటువంటి సమచారాన్ని తెలుసుకుని వెళితే ఇంటర్వ్యూ వన్ సైడ్ బ్యాటింగ్ లా సాగిపోతుంది. ఇదే కాదు, అప్పటికే ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు గతంలో పని చేసిన కంపెనీల సమాచారాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఫ్రెషర్స్ అయితే సీనియర్లు, బంధు మిత్ర, పరిచయ వర్గంలో మంచి జాబ్స్ లో ఉన్నవారి సూచనలు, సలహాలు తీసుకోవడం కూడా మేలు చేస్తుంది. 

అవకాశం వెంటే అవకాశం

అవకాశం చేజారితే నిరాశకు లోను కావద్దు. లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. రిక్రూటర్ మీ విషయంలో ఎందుకు సంతృప్తి చెందలేదు, మీరెందుకు నమ్మకం కలిగించలేకపోయారు, మెప్పించలేకపోయారు, వాస్తవంగా మీ వైపు నుంచి ఆ జాబ్ చేసేందుకు లేని నైపుణ్యం ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ మననం చేసుకోవాలి. నేడు దాదాపుగా ప్రతి ఒక్కరూ సాధారణ విద్య పూర్తయిన తర్వాత పలు కోర్సులు చేస్తుండడం చూస్తున్నాం. విద్యకు నైపుణ్యాన్ని జోడించుకునే ప్రయత్నమే ఇది కూడా. అందుకే ఏ రంగం వైపు వెళ్లాలనుకుంటే ఆయా రంగానికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్య కోర్సులు చేయడం ఉద్యోగాన్వేషణను సులభతరం చేస్తుంది. ఒక అవశాశం పోతే పోయింది… తమను తాము మెరుగుపరచుకుని మరింత పట్టుదలతో మరో మంచి అవకాశాన్ని వెతికి పట్టుకోవాలి.  

కంపెనీయే పిలిచి ఉద్యోగం ఇవ్వాలి మరి… 

representational imageఉద్యోగం కోసం అడుక్కునేలా ఉండకూడదు. కంపెనీయే పిలిచి మరీ ఉద్యోగం ఇవ్వాలి. నాకు జాబ్ ఇవ్వడం ఆ కంపెనీ అదృష్టం అని కొందరు ఔత్సాహికులు, తమ గురించి తాము గొప్పగా భావించే వారు అనుకుంటుంటారు. నిజమే మీ దగ్గర అంత సత్తాయే ఉంటే పిలిచి మరీ ఆసనం ఇవ్వడానికి కంపెనీ రిక్రూటర్లు ఏ మాత్రం సంకోచించరు. కానీ మీ గురించి అంత గొప్పగా చెప్పుకోవడంతోపాటు, గొప్ప బ్రాండ్ ఇమేజీని కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లింకెడిన్, ఫేస్ బుక్ వంటి వేదికలు ఉపకరిస్తాయి. 

మీకున్న యునిక్ ఎక్స్ పీరియన్స్, స్కిల్స్, ఇంటరెస్ట్, వాల్యూస్. నెట్ వర్క్ మీ పేజీలో కనిపించేలా రాయండి. వివిధ రంగాల్లోని వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవాలి. వారికున్న అనుభవాలను చాకచక్యంగా తెలుసుకోవాలి. చిక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో మీకున్న టాలెంట్ గురించి ఒక్క నిమిషంలో చెప్పి విన్న వారిని ఫ్లాట్ చేయగల కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా అవసరం. అవి లేకుండా నిపుణుల సాయంతో నేర్చుకోండి. ఫేస్ బుక్ పేజీలో రెజ్యుమే లేదా వీడియో రెజ్యుమేను అప్ లోడ్ చేయండి. అప్పటికే ప్రొఫెషనల్ గా, విద్యా పరంగా సాధించిన విజయాలను అందులో పేర్కొనండి. కంపెనీల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారి అభినందనలను కూడా ఫేస్ బుక్ లో బంధించేయండి. రిక్రూటర్ల వేటలో మీ ప్రొఫైల్ ఎదురుపడడం ఆలస్యం పిలుపు ఖరారవుతుంది. 

ఫ్రెషర్లూ ఇవి గమనించండి.. 

ఉద్యోగాన్ని ఆశిస్తున్న ఫ్రెషర్లు ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఆయా కంపెనీల గురించి వెబ్ సైట్ ద్వారా, గూగుల్ ద్వారా తగినంత సమాచారాన్ని తెలుసుకుని వెళితే జాబ్ రావడానికి వీలుంటుంది. ఎందుకంటే ఫ్రెషర్లకు ఎక్స్ పీరియన్స్ ఏమీ ఉండదు. వారిలో ఉన్న కష్టపడేతత్వం, స్టడీస్ లో ఎంత మెరుగ్గా రాణించారు, ఉద్యగంపై వారికున్న ఆసక్తి తదితర విషయాలను రిక్రూటర్లు పరిశీలిస్తారు. అందుకే కంపెనీ గురించి తెలుసుకుని వెళ్లడం లాభకరం. 

ఉదాహరణకు హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీలో సేల్స్ విభాగంలో జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లారనుకోండి. యూనీలీవర్ ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయి. వాటి మార్కెట్ షేర్ ఎంత, కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసిన ఉత్పత్తులు, వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన, అమ్మకాల పరంగా, ఆదాయాల పరంగా ఆ రంగంలో కంపెనీ స్థానం, లెటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్...  వీటి గురించి మీ అంతట మీరే చెప్పేస్తే ఇంటర్వ్యూ నిర్వహించే వ్యక్తి తెల్లబోక తప్పదు. దాని వల్ల కంపెనీ ఉత్పత్తులు, అమ్మకాల విషయమై మీకున్న శ్రద్ధాసక్తులను, ఉద్యోగం ఇస్తే ఫలితం చూపింగలరన్న నమ్మకాన్ని కల్గిస్తుంది. 

అంతేకాదు, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలానూ లేదు. అందుకే ఎంబీయే, బీటెక్ తదితర కోర్సుల్లో భాగంగా చేసిన ప్రాజెక్టుల గురించి వివరించండి. మీరు సాగించిన పరిశోధన, కృషి తెలియజేయండి. నాకు అవకాశం ఇస్తే గొప్పగా పనిచేస్తా, ఐ యామ్ వెరీ పాషనేట్ లాంటి అరిగిపోయిన కొటేషన్లు ఇవ్వవద్దని నిపుణుల సలహా. గొప్పగా పనిచేస్తా అని కాదు. ఒక ఉత్పత్తిని ఎలా మార్కెట్ చేస్తారు. ఎలా చేస్తే అమ్మకాలు పెరుగుతాయి అలా చెబితే బెటర్. 

ఇదొక ప్రభుత్వ ఉద్యోగ వేదిక 

నిరుద్యోగులు, జాబ్ స్కిల్స్, కెరీర్ ఫౌండేషన్ కోర్సులు చేయాలనుకునేవారు, కెరీర్ కౌన్సెలింగ్ తీసుకోవాలని అనుకునేవారు, ఎంప్లాయర్లు, ఎలాంటి విద్యార్హత, పని నైపుణ్యం లేని కార్మికులు ఉద్యోగ అవకాశాల కోసం, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్లు ఇలా ప్రతి ఒక్కరికీ ఉపకరించే వేదిక నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్ సీఎస్). కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఎన్ సీఎస్ పోర్టల్ http://www.ncs.gov.in/Pages/default.aspx ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లను ఏకీకృతం చేశారు. అంటే ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లు ఆన్ లైన్ రూపంలోకి మారాయి. గతంలో చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లతో ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లకు వెళ్లి క్యూలలో వేచి ఉండి నమోదు చేసుకోవడం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ఈ వేదికలో నమోదు చేసుకోవచ్చు. దాంతో తగిన ఉద్యోగావకాశాల సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాదు ఎంప్లాయర్లు సైతం అభ్యర్థుల వివరాలను పొందడం ద్వారా అవకాశాలను ఆఫర్ చేయవచ్చు. 

ఎన్ సీఎస్ సేవలను ఆన్ లైన్ లో నేరుగా నమోదు చేసుకుని పొందవచ్చు. వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1514 కు వారంలో మంగళవారం నుంచి ఆదివారం వరకు ఏ రోజైనా కాల్ చేసి తెలుసుకోవచ్చు. నేరుగా కౌన్సెలింగ్ సేవలు అందించేందుకు ప్రభుత్వం మోడల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తోంది. 

ఎన్ సీ ఎస్ పోర్టల్ లో ఆధార్ నంబర్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లలో నమోదు చేసుకున్న తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల డేటా ఈ పోర్టల్ లో భద్రంగా ఉంది. ఆధార్ నంబర్ ఆదారంగా వారు తమ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ల నుంచి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని ఇందులో పొందుపరచమని కేంద్రం కోరింది. అన్ని రకాల కోర్సులు, ఉద్యోగాల సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements