ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 Etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?

Fri, Mar 02, 2018, 03:32 PM
Related Image

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. దీంతో నెట్ వాడే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇవన్నీ కలసి డిజిటల్ చెల్లింపులను పెంచుతున్నాయి. పేటీఎం తరహా వ్యాలెట్లు, ఓలా మనీ, మొబిక్విక్, సొడెక్సో, సిట్రస్ వ్యాలెట్ తదితర డిజిటల్ పేమెంట్ వ్యాలెట్లు చాలానే ఉన్నాయి. వీటిని వినియోగించే వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా పూర్తి కేవైసీ వివరాలతో తమ వ్యాలెట్లను అప్ డేట్ చేసుకోకపోతే ఈ నెల 28 తర్వాత కొన్ని రకాల ప్రయోజనాల్ని కోల్పోవాల్సి వస్తుంది.


వీటన్నింటినీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్స్ (పీపీఐ) గా పిలుస్తారు. ఎక్కడైనా ఓ వేదిక దగ్గర ముందస్తు చెల్లింపులకు వీలు కల్పించే డిజిటల్ సాధనాలు ఇవి. వీటి నుంచి చెల్లింపులు చేస్తే కొంత మేర క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను ఆయా సంస్థలు ప్రమోషన్ లో భాగంగా అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకునేవి ఈ తాయిలాలే. ఒక్కసారి వీటిని వాడడం మొదలు పెట్టిన తర్వాత ఆ ప్రయోజనాలు లేకపోయినా వాటి వినియోగం కొనసాగుతూనే ఉంటుంది.

ముఖ్యంగా కొన్ని వేదికల దగ్గర వ్యాలెట్ ద్వారా చెల్లింపులు ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. కారణాలేవైనప్పటికీ ఈ పీపీఐ వ్యాలెట్లను వాడే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. వీరంతా ఈ నెల 28లోపు ఫుల్ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే మీ ఖాతా నిలిపివేయడం లేదా లాక్ చేయడం జరుగుతుంది. పీపీఐలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్ బీఐ గతేడాది డిసెంబర్ లో సవరణలు చేసింది. వీటి ప్రకారం పీపీఐ కంపెనీలు పూర్తి కేవైసీలను పూర్తి చేయాలి. అంటే కస్టమర్ల నుంచి నో యువర్ కస్టమర్ (కేవేసీ) వివరాలు పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి సాధారాణ సేవలు అందించగలవు. లేదంటే వ్యాలెట్ల వినియోగంపై ఆంక్షలు అమలవుతాయి. ఒకవేళ పూర్తి కేవైసీ ఇచ్చి లేకపోతే అది పూర్తి చేసుకోవడం మంచిది.

ఫుల్ కేవైసీ
representational imageప్రస్తుతం డిజిటల్ వ్యాలెట్ల యూజర్లలో అధిక శాతం సాధారణ కేవైసీ నిబంధనలు కూడా పూర్తి చేసి ఉండరు. గతంలో ఎప్పుడో వ్యాలెట్ లో తమ పేరు, మొబైల్ నంబర్ క్రియేట్ చేసుకున్న వారు వాటిని చక్కగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ఇంత వరకు వారి మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీలనే వెరిఫై చేసి ఉన్నారు. వారికి సంబంధించి ఇతర వివరాలు ఏంటన్నది వ్యాలెట్ సంస్థలకు తెలియదు. కానీ, ప్రతీ కస్టమర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.

 ఇటీవలి కాలంలో ఈ వ్యాలెట్లలో లాగిన్ అయ్యే వారు తమ పేరు, పాన్ లేదా ఆధార్ నంబర్ తో నమోదు చేసుకుంటున్నారు. ఇది బేసిక్ కేవైసీ మాత్రమే. బేసిక్ కేవైసీ అన్నది పలు నియంత్రణలతో ఉంటుంది. ఉదాహరణకు పేటీఎంలో కనీస కేవైసీ కస్టమర్లు ఇతర వ్యాలెట్లకు డబ్బులు పంపుకోలేరు. అలాగే బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు పంపుకునేందుకు అవకాశం లేదు. అదే విధంగా వ్యాలెట్ లో రూ.10,000కు మించి లోడ్ చేసుకోలేరు.

ఆర్ బీఐ 2017 అక్టోబర్ లో కేవైసీకి సంబంధించి పీపీఐ సంస్థలకు మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. తొలుత ఫుల్ కేవైసీ నిబంధనలు పూర్తి చేసేందుకు ఏడాది గడువు ఇవ్వగా, తాజాగా ఫిబ్రవరి 28లోపే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కేవైసీ నిబంధనల నుంచి మినహాయించాలని ఆయా సంస్థలు ఆర్బీఐని గట్టిగానే కోరాయి. ఎందుకంటే 80 శాతం వాటి ఆదాయం బేసిక్ కేవైసీ అకౌంట్ల నుంచే వస్తోంది. అయినా కేంద్ర బ్యాంకు అందుకు అంగీకరించలేదు. ఒకవేళ చివరి నిమిషంలో ఏమైనా మినహాయింపు ఇస్తుందేమో చూడాలి.

ఫుల్ కేవైసీ పూర్తి చేయడం ఎలా?
ఆర్ బీఐ మినహాయింపు ఇస్తుందని చూడడం కంటే కేవైసీ నిబంధనలు పూర్తి చేసుకోవడం వినియోగం దృష్ట్యా మంచిదే. పూర్తి కేవైసీలో భాగంగా మీ వ్యాలెట్ ను ఆధార్ తో అనుసంధానించుకోవాలి. మొబైల్ నంబర్ ఆధారంగా యాప్స్ నుంచి లేదా వాటి వెబ్ సైట్ నుంచి లేదా కేవైసీ సెంటర్ కు వెళ్లి కూడా పూర్తి చేసుకోవచ్చు.

పేటీఎం
representational imageపేటీఎం వ్యాలెట్ యూజర్లు పూర్తి కేవైసీ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా ముఖాముఖిగానే సాధ్యం. అంటే పేటీఎం ప్రతినిధిని కలసి అన్ని వివరాలు తెలియజేసి పత్రాలను చూపించడం ద్వారా ఆధార్ ధ్రువీకరణ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదా కేవైసీ సెంటర్ కు వెళ్లి కూడా చేసుకోవచ్చు.

పేటీఎం అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత కేవైసీ ఐకాన్ ను సెలక్ట్ చేసుకుని 12 అంకెల ఆధార్ నంబర్, ఆధార్ కార్డుపై ఉన్న పేరును ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ అనే బటన్ ను క్లిక్ చేస్తే, చూజ్ కేవైసీ ఆప్షన్ వస్తుంది. రిక్వెస్ట్ ఏ విజిట్, విజిట్ ఏ కేవైసీ సెంటర్ ఆప్షన్లు కనిపిస్తాయి. రిక్వెస్ట్ ఏ విజిట్ ను సెలక్ట్ చేసుకుంటే మీ చిరునామా ఇవ్వాలి. దాంతో పేటీఎం ప్రతినిధి మీ చిరునామాకు వచ్చి అన్ని పత్రాలను పరిశీలించి వెళతారు. కేవైసీ సెంటర్ కు వెళ్లేట్లు అయితే ఆధార్ ఒరిజినల్ కార్డు తీసుకెళ్లాలి.

ఓలా మనీ
ఓలా మనీ అకౌంట్ ను పూర్తి కేవైసీగా మార్చుకునేందుకు ఈ లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి.
https://accounts.olacabs.com/?returnurl=https://accounts.olacabs.com/kyc?cnl=email
representational imageఅనంతరం మొబైల్ నంబర్ టైప్ చేసి నెక్ట్స్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఓటీపీ కాలమ్ లో ఎంటర్ చేయాలి. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ లేదా పాస్ పోర్ట్ నంబర్లలో ఒకటి ఇవ్వడం ద్వారా బేసిక్ కేవైసీ పూర్తవుతుంది. అప్పుడు అప్ గ్రేడ్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా పూర్తి కేవైసీ కిందకు మారిపోవవచ్చు. అక్కడ ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. యూఐడీఏఐ సెంటర్ నుంచి వచ్చే నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా పూర్తి కేవైసీ ప్రక్రియ ముగుస్తుంది. ఓలా మనీలో బేసిక్ కేవైసీ పూర్తి చేసిన వారు నెలవారీగా రూ.10,000 వ్యాలెట్ బ్యాలెన్స్ కు పరిమితం కావాలి. క్యాబ్ చార్జీలను నగదు రహితంగా ఓలా మనీ నుంచే చెల్లించొచ్చు. బిల్లులు, రీచార్జ్ లకూ అనుమతి ఉంది. అదే ఫుల్ కేవైసీ కస్టమర్లు నెలలో రూ.లక్ష కూడా వ్యాలెట్ లో లోడ్ చేసుకోవచ్చు. ఇతరులకు డబ్బులు పంపుకోవచ్చు. ఓలా మనీ నుంచి నగదును బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. మొబిక్విక్ యూజర్లు సైతం, యాప్ నుంచి, వెబ్ సైట్ నుంచి కూడా కేవైసీ వివరాలు ఇవ్వడం ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
 
Articles (Education)