బీమా కంపెనీలతో సమస్యలా... అంబుడ్స్ మెన్ తలుపు తట్టండి!

03-04-2016 Sun 13:15

బీమా పాలసీ తీసుకోక ముందు వెంటపడి కట్టించుకున్న కంపెనీ ప్రతినిధులు… పోనీలే ఆపత్కాలంలో రక్షణగా ఉంటుందనుకుంటే… క్లెయిమ్ సమయంలో ఎన్నో కిరికిరీలు... పరిహారానికి జాప్యం కూడా చేయవచ్చు. పాలసీ పత్రంలో తప్పులు దొర్లితే మార్చాలని కోరితే రోజులు గడిచినా స్పందించకపోవచ్చు. సమస్య ఏదైనా బీమా కంపెనీల మెడలు వంచాలంటే ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ తలుపు తట్టడమే నయం.  

బీమాదారుడు, బీమా కంపెనీల మధ్య విశ్వాసాన్ని నెలకొల్పేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 1998లో ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారంతోపాటు పాలసీదారుల హక్కుల పరిరక్షణ  అంబుడ్స్ మెన్ బాధ్యత. 

30 రోజులు దాటితే...

పాలసీ పత్రం పోయినా...? పాలసీదారుడు మరణించినా పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్నా...?  సమస్య ఏదైనా గానీ, ముందు సదరు కంపెనీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి. ఫాక్స్ లేదా ఈ మెయిల్ చేసినా చాలు. 30 రోజుల్లోగా దానిపై కంపెనీ స్పందించాల్సి ఉంటుంది. ఎటువంటి స్పందన లేకపోయినా, లేక కంపెనీ స్పందన సంతృప్తికరంగా అనిపించకపోయినా ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించవచ్చు. కాకపోతే అప్పటికే వినియోగదారుల ఫోరం లేదా కోర్టును ఆశ్రయించి ఉండరాదు. 

అంబుడ్స్ మెన్ కు లిఖితపూర్వకంగా గానీ, మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా గానీ సమస్యను నివేదించవచ్చు. దేశవ్యాప్తంగా 12 అంబుడ్స్ మెన్ కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో  ఉన్న కార్యాలయం పరిధిలో తెలంగాణ, ఏపీ, యానాం ప్రాంతాలు వస్తాయి. 

HYDERABAD

Office of the Insurance Ombudsman,

6-2-46, 1st floor, "Moin Court"

Lane Opp. Saleem Function Palace,

A. C. Guards, Lakdi-Ka-Pool,

Hyderabad - 500 004.

Tel.:- 040-65504123/23312122

Fax:- 040-23376599

Email:- bimalokpal.hyderabad@gbic.co.in

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంబుడ్స్ మెన్ కార్యాలయాల చిరునామాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ను సందర్శించండి. http://www.policyholder.gov.in ఇన్సూరెన్స్ కార్యాలయం ఏ అంబుడ్స్ మెన్స్ పరిధిలోకి వస్తుందో అక్కడే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. 

సాధారణంగా అంబుడ్స్ మెన్ పరిష్కారానికి తీసుకునే సమస్యల్లో... 

ప్రీమియం చెల్లించినప్పటికీ పాలసీ పత్రాలు రాకుంటే, పాలసీదారుడు దాఖలు చేసిన క్లెయిమ్ ను తగిన కారణం లేకుండా తిరస్కరిస్తే, పూర్తి పరిహారానికి నిరాకరించి కొంత వరకే ఆమోదిస్తే, క్లెయిమ్ ను ఆమోదించినప్పటికీ పేమెంట్ రాకపోయినా?, పాలసీ నిబంధనలకు సంబంధించిన సమస్యలు ఉన్నా? పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్నా? తదితర అంశాల విషయంలో పరిష్కారానికి అంబుడ్స్ మెన్ చర్యలు చేపడుతుంది. ఇన్సూరెన్స్ వ్యవహారాలకు సంబంధించి 20 లక్షల రూపాయల వరకు అంబుడ్స్ మెన్ ను సంప్రదించవచ్చు. మూడు నెలల్లోగా అంబుడ్స్ మెన్ తన తీర్పును వెలువరిస్తుంది. అంబుడ్స్ మెన్ ఆదేశాలను కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. న్యాయం జరగలేదని భావిస్తే వినియోగదారుల ఫోరం, లేదా కోర్టును ఆశ్రయించవచ్చు. 

Read : జీవిత బీమా పాలసీల గురించి... A టు Z


More Articles
Advertisement
Telugu News
Another lot of Covishield vaccine doses arrives AP
ఏపీకి చేరుకున్న మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు
8 minutes ago
Advertisement 36
Vekaiah naidu om birla did not allow standing committee meetings virtually
స్థాయి సంఘాల వర్చువల్‌ సమావేశాలకు అనుమతి ఇవ్వని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌!
9 minutes ago
Balineni reacts after AP CID officials arrests MP Raghurama Krishna Raju
రఘురామకృష్ణరాజు ఓ సైకో... జగన్ ఓపికపట్టడంతో ఇన్నాళ్లు రెచ్చిపోయాడు: మంత్రి బాలినేని
28 minutes ago
Chandrababu set to spend one crore in Kuppam constituency
కుప్పం ప్రజలకు చంద్రబాబు భరోసా... కరోనాను ఎదుర్కోవడానికి రూ.1 కోటి వ్యయంతో పలు కార్యక్రమాలు!
42 minutes ago
Rajanikanth second daughter donated rs 1 crore to CM Relief fund
రూ.కోటి విరాళం అందజేసిన రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య
58 minutes ago
Police stops cricketer Prithvi Shaw in Sindhudurg district in Maharashtra
ఈ-పాస్ లేకుండా గోవా వెళుతున్న టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాను ఆపేసిన పోలీసులు
1 hour ago
Telangana covid health bulletin
తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు, 29 మరణాలు
1 hour ago
Kerala Extends Lockdown
కేరళలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు!
1 hour ago
AP CID confirms Raghurama Krishna Raju arrest
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ
1 hour ago
NewZealand have higher winning chances in Southampton Says Manjrekar
డబ్ల్యూటీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ కంటే న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువ: సంజయ్ మంజ్రేకర్‌
2 hours ago
Ayyanna Patrudu questions Raghurama Krishna Raju arrest
జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా?: అయ్యన్న
2 hours ago
Sonu Sood says he feels so sad after woman who listen Love You Zindagi song dies of corona
'లవ్యూ జిందగీ' యువతి కరోనాతో మృతి... జీవితం ఇంత కిరాతకమైనదా? అంటూ సోనూ సూద్ నిర్వేదం
2 hours ago
Is Ghani release date postpone
'గని' కూడా వాయిదా పడ్డట్టేనా?
2 hours ago
Sharmila establish YSSR Team to help women in corona crisis
మహిళలకు సాయం కోసం 'వైఎస్ఎస్ఆర్ టీమ్' ఏర్పాటు చేసిన షర్మిల
2 hours ago
Just a rumour on Chiru movie
చిరూ సినిమాపై అది పుకారేనట!
2 hours ago
TDP AP President Atchannaidu opines on Raghurama Krishnaraju arrest
రఘురామ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారు: అచ్చెన్నాయుడు
2 hours ago
TDP MLA Velagapudi condemns Raghurama Krishna Raju arrest
చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసినందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి
3 hours ago
Simbu remembers about the Ko movie
తమన్నాను తీసుకోలేదని తప్పుకున్న హీరో!
3 hours ago
AP sees more single day corona deaths
ఏపీలో ఏమాత్రం తగ్గని కొవిడ్ తీవ్రత... ఒక్కరోజులో 96 మంది మృత్యువాత
3 hours ago
Bharat questions his father Raghurama Krishna Raju arrest
వారెంట్ లేకుండా మా నాన్నను అరెస్ట్ చేశారు... ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు: రఘురామ తనయుడు భరత్
3 hours ago