ఆభరణాల ధరల్ని వర్తకులు ఇలా నిర్ణయిస్తారు...
23-10-2017 Mon 13:08

బంగారు ఆభరణాల పట్ల భారతీయుల్లో ఎంతో ప్రీతి. ఈ సంప్రదాయం అనాదిగా వస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్తగా ఆభరణాలను కొనుగోలు చేసే వారు ఒక రకం అయితే, ఉన్న వాటిని తరచూ మార్చేవారూ ఉన్నారు. అయితే, చాలా మంది ఆభరణాల ప్రియలకు తెలియని విషయం ఒకటుంది. అదే వాటి ధరల నిర్ణయం ఎలాగన్నది? సాధారణంగా బంగారు ఆభరణాల ధరలు షాపు, షాపునకు మారిపోతుంటాయి. ఎందుకని? ఈ విషయమై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

అయితే, వర్తకులు వేసిన ధరలపై మౌనంగా ఉండకుండా ప్రశ్నించడం మంచిది. వర్తకులు వేసిన చార్జీలను గుడ్డిగా నమ్మొద్దు. నిజానికి బంగారం ఆభరణాల తుది ధరకు ముందు వివిధ రకాల చార్జీలు దానికి కలుపుతుంటారు. ఈ ధరలన్నవి అన్ని షాపుల్లోనూ ఒకే తీరులో ఉండవు. షాపు, షాపునకు మారిపోతుంటాయి. ఎందుకంటే బిల్లింగ్ కు సంబంధించి ఓ ప్రామాణిక విధానం మన దేశంలో ఇప్పటి వరకు లేదు. ఎవరికి తోచినట్టు వారు వేస్తుంటారు. ప్రతీ పట్టణంలోనూ బంగారం వర్తకుల సంఘం అని ఉంటుంది. ఈ సంఘమే ఇతర ప్రముఖ మార్కెట్ల ధరల ఆధారంగా ప్రతి రోజూ ఉదయం స్థానిక ధరల్ని ఖరారు చేస్తుంటుంది.
బిల్లింగ్ ఇలా...

స్టడెడ్ జ్యుయెలరీ

బంగారం స్వచ్ఛత

బంగారం ధరలు
సాధారణంగా బంగారం ధరలకు ప్రామాణిక విధానం లేదని చెప్పుకున్నాం కదా. అందుకే బంగారం ధరను నిర్ణయించే ముందు అందులో ఉన్న బంగారం శాతం, దానికి ఏ లోహం కలిపామన్నది కీలకం అవుతుంది. బంగారం ధరలు ప్రతీ రోజూ మారిపోతుంటాయి. అంతర్జాతీయంగా దీన్ని పెట్టుబడుల సాధనంగానూ ఉపయోగిస్తుంటారు. దీంతో నిత్యం ధరలు మార్పునకు లోనవుతుంటాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం గనుక బంగారం ధరలపై కరెన్సీ మారకం విలువల ప్రభావం ఉంటుంది. మనం బంగారాన్ని డాలర్ల రూపంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తాం. డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. రూపాయి బలపడితే బంగారం ధర తగ్గుతుంది. కొనుగోలుకు, సరఫరాకు మధ్య ఉన్న తేడా తదితర అంశాలు బంగారం ధరపై ప్రభావితం చూపిస్తుంటాయి. పైగా వర్తకులు ఎక్కడ నుంచి బంగారం కొనుగోలు చేశారు, ఎంతకు కొనుగోలు చేశారన్న అంశం కూడా కీలకమే. అందుకే షాపునకు, షాపునకు ధరలు మారిపోయేది. అయితే, బంగారం ధరల్లో ఇలాంటి వ్యత్యాసం స్వల్పమేనని నిపుణులు అంటున్నారు.
తయారీ చార్జీలు

ఒకవేళ ఎక్కువ డిజైన్ తో ఉంటే ఈ తయారీ చార్జీలు 25 శాతం వరకూ చెల్లించాల్సి రావచ్చు. తయారీ చార్జీలను బంగారంలో నిర్ణీత శాతం లేదా గ్రాముకు ఇంత చొప్పున వసూలు చేసే రెండు విధానాలు ఆచరణలో ఉన్నాయి. వినియోగదారులు ఈ తయారీ చార్జీలను తగ్గించాలని వర్తకులను కోరొచ్చు. పైగా దుకాణంలో సేల్స్ పర్సన్ వేసిన చార్జీలను తగ్గించాలని అడిగితే మేనేజర్ తగ్గించడం కూడా జరుగుతుంది. అంటే బిల్లింగ్ లో, వేసిన చార్జీల్లో పారదర్శకత లేదనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. బంగారం ధరలు తగ్గుతుంటే తయారీ చార్జీలను నిర్ణీత శాతంగానూ, బంగారం ధర పెరుగుతుంటే గ్రాముకు ఇంత చొప్పున ఫ్లాట్ గా విధించే తయారీ చార్జీల విధానం మేలు.
వేస్టేజ్, తరుగు
బంగారం ముద్దను ఆభరణంగా మార్చే క్రమంలో కొంత వృధా అవుతుంది. కటింగ్, సోల్డరింగ్, కరిగించే క్రమంలో ఇలా జరుగుతుంది. దీన్ని వేస్టేజ్ లేదా తరుగుగా పేర్కొంటారు. ఆభరణాన్ని బట్టి దీన్ని వర్తకులు నిర్ణయిస్తారు. ఈ వృధా చార్జీలు 3 నుంచి 25 శాతం వరకు ఉంటాయి. ఒకే ఆభరణం రెండు షాపుల్లో వేర్వేరుగా ఉండడానికి ఈ తరుగు, తయారీ చార్జీల్లో వ్యత్యాసం కూడా ఒక కారణం.
హాల్ మార్క్

హాల్ మార్క్ లేకుండా విక్రయించే ఆభరణాల్లో బంగారం 18 క్యారట్లకు మించి ఉండదని ఓ అంచనా. దీంతో ఈ తరహా ఆభరణాల్లో వర్తకులకు ఎక్కువ లాభం ఉంటుంది. కనుక ధరలు తక్కువగా వేసి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. బంగారంలో స్వచ్ఛత ఎంత శాతం, పాత ఆభరణాల మార్పిడికి అవకాశం ఉందా?, ఉంటే ఎంత తరుగు తీసి, ఎంత రేటు నిర్ణయిస్తారు? ఆభరణంపై వారంటీ ఏమైనా ఉందా, బిల్లులో పారదర్శకంగా అన్ని చార్జీలను వివరంగా పేర్కొన్నారా? తదితర అంశాలను గమనించాలి. చిన్న వర్తకులు బంగారం ధరను డిస్ ప్లేలో ఉంచడం అరుదు. పెద్ద వర్తకులు బహిరంగంగానే ఆ రోజు బంగారం మార్కెట్ ధరను ప్రదర్శిస్తారు. కొందరు పెద్ద వర్తకులు బంగారు ఆభరణాలపై సున్నా తయారీ చార్జీల పేరుతో ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. అయితే వీరు ఈ చార్జీలను తరుగు లేదా మరో రూపంలో విధించే అవకాశం ఉంటుందని గమనించాలి.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
7 hours ago
Advertisement 36

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
7 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
7 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
8 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
8 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
8 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
8 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
8 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
9 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
9 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
9 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
9 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
10 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
10 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
11 hours ago

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
11 hours ago

నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
11 hours ago

ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
11 hours ago

కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
11 hours ago

అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
12 hours ago