రుణం కావాలా...? పీ2పీ వేదికలో దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాలో జమ ...!
12-10-2017 Thu 12:53

అప్పు అవసరం లేని వారు ఈ రోజుల్లో తక్కువ మందే ఉంటారు. అవసరం వున్నా.. లేకపోయినా బదులు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారు ఎందరో. అవసరంలో అప్పు ఇచ్చే నాథుడు కనిపించక ఎన్నో తంటాలు పడే వారూ ఉన్నారు. ఈ క్రమంలో సులభంగా రుణం పొందే అవకాశం ఉన్న పీర్ టు పీర్ లెండింగ్ గురించి తెలుసుకోవాల్సిందే మరి. అంతేకాదు, చేతిలో డబ్బులు దండిగా ఉంటే అప్పు ఇవ్వడం ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకూ ఇదే మార్గం.
పీటుపీ లెండింగ్
రుణం కోరుకుంటున్న వారిని, అదే సమయంలో రుణం ఇవ్వాలనుకుంటున్న వారినీ కలపడమే పీర్ టు పీర్ లెండింగ్ కాన్సెప్ట్. అధిక వడ్డీ ఆదాయం కోరుకునే వారు ఈ వేదికల ద్వారానే రుణాలను ఆఫర్ చేస్తుంటారు. రుణం ఇచ్చే వ్యక్తి నిర్దేశించిన నిబంధనలకు, రుణం ఆశిస్తున్న వ్యక్తి కట్టుబడితే సులభంగా రుణం పొందేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. పీటుపీ లెండింగ్ ను క్రౌండ్ ఫండింగ్ అని, సోషల్ లెండింగ్ అనే పేర్లతోనూ చెప్పుకుంటారు.
పీటుపీ వేదికలు

ఎవరికి...?
ఉదాహరణకు మీ దగ్గర మిగులు నిధులు ఉన్నాయి. వాటిపై మంచి వడ్డీ ఆదాయం పొందాలనుకుంటున్నారు. దీంతో పీటుపీ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసుకుని అదే వేదికగా మీరు కోరుకుంటున్న వడ్డీని చెల్లించే వారికి రుణాన్ని ఆఫర్ చేయవచ్చు. అదే సమయంలో రుణాన్ని ఆశించేవారు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా సులభంగా ఆన్ లైన్ మాధ్యమం ద్వారానే రుణాన్ని పొందడానికి కూడా ఈ సాధనం ఉపయోగపడుతుంది.
రుణం ఇచ్చే ముందు ఏం చూస్తారు?

ప్రముఖ పీటుపీ వేదికలు
క్యాపిటల్ ఫ్లోట్, లెండెన్ క్లబ్, ఐలెండ్, ఫెయిర్ సెంట్, క్రెడి ఫయబుల్, రుపాయ ఎక్చేంజ్, లెండ్ బాక్స్, ఐటుఐ ఫండింగ్, ఐలెండ్, లెండింగ్ కార్ట్ తదితర సంస్థలు పీటుపీ లెండింగ్ సేవలు అందిస్తున్నాయి.
ఆర్ బీఐ కొత్త నిబంధనలు
పీటుపీ వేదికల ద్వారా వ్యాపారం విస్తరిస్తుండడంతో వీటిని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్ సీ) మాదిరిగానే ఆర్ బీఐ నియంత్రణ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పీటుపీ సంస్థల విషయంలో ఆర్ బీఐ నిబంధనలు ఇలా ఉన్నాయి.
- పీటుపీ వేదికల ద్వారా ఇచ్చే రుణాలు గరిష్టంగా 36 నెలల కాలానికి మించకూడదు.
- పీటుపీ వేదిక ద్వారా ఓ వ్యక్తి ఇచ్చే రుణాల మొత్తం విలువ రూ.10 లక్షలకే పరిమితం కావాలి. అంటే, ఎంత మందికైనా రుణాలను ఆఫర్ చేయవచ్చు కానీ, ఇలా ఇచ్చే రుణాల మొత్తం విలువ రూ.10 లక్షలు దాటకూడదు.
- రుణాలు తీసుకునే వారికి కూడా ఇదే పరిమితిని ఆర్ బీఐ విధించడం విశేషం.
- ఒక లెండర్ ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.50 వేల రుణం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.
- అన్ సెక్యూర్డ్ రుణాలుగానే వీటిని ఆఫర్ చేయాలి. అంతేకానీ, ఎటువంటి హామీలను తీసుకోవడానికి అనుమతి లేదు. హామీ, పూచీకత్తు, తనఖా ఈ తరహా నిబంధనలు లేకుండా రుణాలను ఆఫర్ చేయాల్సి ఉంటుంది.
- పీటుపీ ప్లాట్ ఫామ్ లు సొంతంగా రుణాలు ఇవ్వకూడదు. డిపాజిట్లు తీసుకోరాదు.
రుణం తీసుకునేది ఎలా...?

బ్యాంకులో ఎస్క్రో ఖాతా తెరిచి దాని ద్వారా రుణాలను అందించాల్సి ఉంటుంది. పీటుపీ సంస్థ భాగస్వామ్యంతో ఇది జరుగుతుంది. పీటుపీ వేదికలో రుణాలను ఆశించే వారి రేటింగ్ ను గమనించి, వాటి ఆధారంగా తమకు ఆమోదం ఉన్న వడ్డీ రేటు చెల్లించగలిగే వారికి రుణాలను ఆఫర్ చేస్తారు. రుణదాతల్లోనూ భిన్న రకాలు ఉంటారు. రిస్క్ (రుణం వసూలులో ఉన్న రిస్క్) తక్కువ ఉన్న వారికే రుణాలను ఇచ్చే వారు, రిస్క్ ఎక్కువున్నా సరే వడ్డీ ఆదాయం అధికంగా ఆశించే వారు, అన్ని రకాల రిస్క్ కేటగిరీల వారికి రుణాలను ఆఫర్ చేసేవారు ఉంటారు.
రివర్స్ ఆక్షన్

పీటుపీ వేదికలు రుణం తీసుకుంటున్న వారి నుంచి ఇచ్చిన వారి పేరు మీద పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకునేందుకు సాయం చేస్తాయి. రుణం తిరిగి వసూలులోనూ సాయపడుతున్నాయి. అంతేకానీ, రుణం ఇస్తున్న వారికి హామీదారులుగా ఉండవు. రుణానికి సంబంధించిన రిస్క్ ఏదైనా అది ఇచ్చిన వారే స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు, సమాచారం, ఒప్పందాలు, రుణం జారీ, తిరిగి వసూలు ఈ తరహా సేవలను పీటుపీ వేదికలు అందించడం వరకే పరిమితం అవుతాయి. వారి నుంచి వసూలు చేసే ఫీజులే వీటికి మిగిలే ఆదాయం. రుణం తీసుకున్న వారు ఎగ్గొడితే ఇచ్చిన వారు ఆ మేరకు నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అధిక రిస్క్ కేటగిరీ వారికి రుణం ఇస్తే అధిక అదాయం వస్తుంది. కానీ, డిఫాల్టింగ్ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ రిస్క్ నేపథ్యంలో రుణదాతల విలువను కాపాడేందుకు కొన్ని పీటుపీ వేదికలు ప్రొటెక్షన్ ఫండ్ అంటూ నిర్వహిస్తున్నాయి.
ఎవరికి, వడ్డీ రేటు ఎంత

ఇక మిగులు నిధులు ఉండి, వాటిని ఆదాయ వనరుగా మార్చుకోదలిచిన వారు పీటుపీ వేదికల్లో లెండర్లు (రుణ దాతలు)గా నమోదు చేసుకుని రుణాలు ఇచ్చుకోవచ్చు. వడ్డీ ఆదాయం పొందొచ్చు. నిజానికి మన చుట్టూ వడ్డీ వ్యాపారాలు చేసే వారు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. తెలిసిన వారికి బదులిచ్చి వడ్డీ వసూలు చేసుకోవడం అన్నది మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచీ ఉన్నదే. కాకపోతే దీన్ని కాస్త సురక్షితమైన వేదికగా చేసుకునేందుకు పీటుపీ వేదికలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ రుణ గ్రహీతలు, రుణదాతలకు తెలియక్కర్లేదు. ఒకరి పరిచయం, మరొకరికి అవసరం లేదు. వారి క్రెడిట్ రిస్క్ ఇక్కడ ప్రామాణికం. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజులు ఉండొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రుణంలో ఒక శాతం వరకు ఉంటుంది. రుణదాతలు, రుణ గ్రహీతల్లో ఎవరిని అనుమతించాలి, అనుమతించకూడదన్నది పీటుపీ సంస్థల ఇష్టమే.
ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగానూ

ప్రపంచ వ్యాప్తంగా...
ప్రపంచ వ్యాప్తంగా పీటుపీ లెండింగ్ వ్యాపారం 2002లో కేవలం 19 కోట్ల రూపాయలు. కానీ, 2015 చివరికి ఇది రూ.38,300 కోట్లకు పెరిగిపోయింది. అటు రుణ గ్రహీతలకు, ఇటు రుణదాతలకు రెండు వర్గాల వారి అవసరాలు తీర్చే వ్యవస్థ కావడమే. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కెనడా (ఆంటారియో), న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికాలోనూ పీటుపీ వ్యాపారంపై అక్కడి నియంత్రణ సంస్థల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, జపాన్ లో నిషేధం అమల్లో ఉంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద పీటుపీ లెండింగ్ మార్కెట్ చైనాదే. వందల కొద్దీ సంస్థలు ఇక్కడ పనిచేస్తుండగా, వాటిపై ఎటువంటి నియంత్రణలు అమల్లో లేవు.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే
3 minutes ago
Advertisement 36

రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం
14 minutes ago

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి?: హరీశ్ రావు
17 minutes ago

ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు యువకుడు
34 minutes ago

అమరావతి ప్రాంతంలో భూప్రకంపనలు
43 minutes ago

బ్రిటిష్ పత్రికల విషపు రాతల వల్లే బయటికొచ్చేశాం: ప్రిన్స్ హ్యారీ
44 minutes ago

8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ పై శిక్షణ: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
54 minutes ago

బొమ్మల్లో ప్లాస్టిక్ తగ్గించండి: ప్రధాని మోదీ
1 hour ago

కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించడం విచారకరం: నారా లోకేశ్
1 hour ago

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
1 hour ago

ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్దకు చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?: తలసాని
1 hour ago

వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు బుమ్రా దూరం
1 hour ago

మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం చేపడతాం: కమలహాసన్
1 hour ago

దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారు: బండి సంజయ్
1 hour ago

ఆసియా కుబేరుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీయే!
1 hour ago

మనవడి కోసం మేకను బలిచ్చిన ఎస్సై... సస్పెండ్ చేసిన అధికారులు
1 hour ago

మహారాష్ట్రను మళ్లీ కమ్మేస్తున్న కరోనా.. దాదాపు అన్ని జిల్లాల్లో విజృంభణ!
2 hours ago

ఇప్పటిదాకా 1.37 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం... విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి పువ్వాడ
2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పునకు గొప్ప సంకేతం: పవన్ కల్యాణ్
2 hours ago

కమలహాసన్ పార్టీతో పొత్తుకు ప్రతిపాదన చేశాం: నటుడు శరత్ కుమార్
2 hours ago