వాట్సాప్ ను వ్యాపార అవసరాలకు వినియోగించుకోవచ్చా...?
20-07-2017 Thu 13:02

వాట్సాప్ సరదా, కాలక్షేపానికి పరిమితం కాదు. ఇదో అతిపెద్ద సమాచార వారధి. వినోదానికే కాకుండా మనసుపెట్టి ఆలోచిస్తే వాట్సాప్ తో బోలెడు ఉపయోగాలున్నాయి. ఎన్నో అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఉపాధి, వ్యాపారానికి కూడా ఇది చుక్కాని వంటిదే.
వ్యాపార అవసరాలు కమ్యూనికేషన్ సాధనం అయినందున వాట్సాప్ వ్యాపార వృద్ధికీ చక్కగా ఉపయోగపడుతోంది. సేల్స్ టీమ్ నిర్వహణకు, వారితో నిరంతరం సంప్రదింపులకు దీన్ని వాడుకోవచ్చు. ఒక గ్రూపు పరిధిలో 250 మందికి చోటు ఉంటుంది గనుక ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్ స్థాయిలో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. మెయిల్స్ తో పోలిస్తే వాట్సాప్ సాయంతో చాలా వేగంగా, సులభంగా అవతలివారిని కనెక్ట్ కావొచ్చు.
భిన్న రకాలుగా...
* ముంబైకి చెందిన రష్ అనే సంస్థ వాట్సాప్ నుంచి కేక్, పుష్పాల కోసం ఆర్డర్లను స్వీకరిస్తోంది.
* నేడు చాలా వేదికలు వాట్సాప్ నుంచి ఫుడ్ కోసం ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. ఉదాహరణకు ఓ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూను వాట్సాప్ లో పెడితే, మెనూ చూసి అందులో నంబర్ ను చెబితే చాలు. ఆ నంబర్ పై ఉన్న ఐటమ్ ను ఇంటికే డెలివరీ చేస్తారు.
* వైద్యుల అపాయింట్ మెంట్ బుకింగ్ ను వాట్సాప్ వేదికగా చేసుకునేందుకు కొన్ని చోట్ల అవకాశం ఉంది. అలాగే సాధారణ ఆరోగ్య సమస్యలపై వైద్యుల సూచనలు, సలహాలను కూడా వాట్సాప్ వేదికగా పొందే అవకాశం ఉంది.
* ఫార్మసీ స్టోర్స్ కు సంబంధించిన వాట్సాప్ నంబర్ కు ప్రిస్క్రిప్షన్ పంపితే చాలు. అన్ని మందులను ప్యాక్ చేసి ఇంటికే పంపించేస్తారు.
* ఢిల్లీ పోలీసులు వాట్సాప్ నంబర్ తో ఓ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభం రోజున 23,000 ఫిర్యాదులు వచ్చిపడ్డాయి.
ఆమె వ్యాపారానికి చక్కని తోడ్పాటు
నీతా అడప్పా ప్రకృతి హెర్బల్స్ పేరుతో హెర్బల్ ఉత్పత్తుల విక్రయాల కోసం, ప్రచారం, కస్టమర్ల సేవల కోసం వాట్సాప్ గ్రూపులను ప్రారంభించింది. విసుగు అనుకోకుండా వచ్చిన ప్రతీ సందేశానికి సమాధానమిస్తుంది. దీంతో ఆమె ఉత్పత్తులకు, సేవలకు చక్కని గుర్తింపు లభించింది. దీంతో ఆమె వ్యాపారం మరింత విస్తరించింది. దీనివల్ల కస్టమర్లతో సన్నిహిత సంబంధాలకు అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

వాట్సాప్ ను చిన్న ఆన్ లైన్ పాఠశాలగానూ ఉపయోగించుకోవచ్చు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక గ్రూపులోకి రావచ్చు. టీచర్లు పాఠశాల ముగిసిన తర్వాత కూడా విద్యార్థులతో విద్యకు సంబంధించి ట్యూషన్స్ ను వాట్సాప్ లో చెప్పుకోవచ్చు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు, వారికి అసైన్ మెంట్స్, పాఠాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు క్లిప్పులు పంపడం, గ్రాఫిక్స్, చార్టులు పంపడం చేసుకోవచ్చు. విద్యార్థులకు వాట్సాప్ యాక్సెస్ ఇవ్వడం అంతగా మంచిది కాదు గనుక వారి తల్లిదండ్రుల ద్వారా అనుసంధానం కావచ్చు.
వ్యాపారుల కోసం ప్రత్యేక యాప్
వాట్సాప్ వ్యాపారుల కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ యాప్ రానుంది. చిన్న వ్యాపారులు ప్రస్తుత యాప్ కు భిన్నమైన వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకుని మరింత మంది కస్టమర్లకు వాట్సాప్ వేదికగా సేవలు అందించొచ్చు. ప్రస్తుతం సాధారణ గ్రూపులో గరిష్టంగా 250కి మించి ఉండేందుకు అవకాశం లేదు. కానీ వ్యాపారుల కోసం రానున్న యాప్ లో సభ్యుల సంఖ్య మరింత ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
7 hours ago
Advertisement 36

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
7 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
8 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
8 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
8 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
8 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
8 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
9 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
9 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
9 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
9 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
10 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
10 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
11 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
11 hours ago

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
11 hours ago

నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
11 hours ago

ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
12 hours ago

కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
12 hours ago

అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
12 hours ago