తల బద్దలయ్యేంత నొప్పి... మైగ్రేయిన్... ఎందుకొస్తుంది..?
03-06-2017 Sat 14:06

ఉన్నట్టుండి తల నొప్పి ప్రారంభమవుతుంది. అది తీవ్ర స్థాయికి చేరి తల పగిలిపోతున్నంతగా బాధిస్తుంది. తల తిరుగుతున్నట్టు, కడుపులో తిప్పుతున్నట్టూ ఉండొచ్చు. కొందరిలో వాంతులు కూడా అవుతాయి. వెలుగును చూడలేనంత తీవ్రంగా వచ్చే ఈ నొప్పి గురించి కొన్ని వివరాలు....
మెదడులో జరిగే కొన్ని రకాల మార్పులు మైగ్రేయిన్ నొప్పికి దారితీస్తాయి. మైగ్రేయిన్ నొప్పికి కచ్చితమైన కారణాలు ఏంటన్నవి ఇంతవరకు నిర్ధారణ కాలేదు. మెదడులోని కణాల మధ్య సమాచారానికి తోడ్పడే నాడీ ప్రసారణుల్లో(న్యూరో ట్రాన్స్ మీటర్), రసాయనాలు, రక్త ప్రసారాల పరంగా జరిగే మార్పులు, హెచ్చు తగ్గులు మైగ్రేయిన్ పెయిన్ కు దారితీస్తాయని భావిస్తున్నారు.

కళ్లు నొప్పిగా అనిపిస్తాయి. వెలుగును చూడలేరు. శబ్దాలు, ఘాటైన వాసనలు కష్టంగా అనిపిస్తాయి. సాధారణంగా తలలో ఒక వైపున వచ్చే దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా అంటుంటారు. కొందరిలో రెండు వైపులా రావచ్చు. ఒక్క మైగ్రేయినే అని కాదు, మరికొన్ని రకాల తలనొప్పుల్లోనూ తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ, అవి మైగ్రేయిన్ కాదు.
మైగ్రేయిన్ ను మోడరేట్ (మోస్తరు), సివియర్ (అధికం), ఇంటెన్సిటీ (తీవ్రమైన) అని మూడు రకాలుగా వర్గీకరించారు. మైగ్రేయిన్ వచ్చినప్పుడు మెట్లెక్కడం, శారీరక శ్రమ, పరుగెత్తడం వంటివి సమస్యను అధికం చేస్తాయి. మైగ్రేయిన్ రావడానికి ముందు మూడింట ఒక వంతు మందిలో కంటి చూపు పరంగా అడ్డంకులు కనిపిస్తాయి. చాలా స్వల్ప సమయం పాటు చూపులో అస్పష్టత కనిపించొచ్చు. ఇలా ఓ గంట పాటు ఉంటుంది. కళ్లలో కాంతి మెరుపులు కనిపించొచ్చు. తిమ్మిరి లేదా బలహీనంగా అనిపించొచ్చు. మాట్లాడడం కష్టంగా అనిపించొచ్చు. మైగ్రేయిన్ నొప్పి కొన్ని గంటల పాటు నుంచి కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ లక్షణాల ఆధారంగా మైగ్రేయిన్ నొప్పా కాదా? అన్నది వైద్యులు గుర్తించి తగిన మందులు సూచిస్తారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లేందుకు సమయం పట్టేట్టు ఉంటే ఉపశమనం కోసం ప్యారాసెటమాల్ టాబ్లెట్లను వేసుకోవచ్చు. ఎంఆర్ఐ, బ్రెయిన్ సీటీ స్కాన్, బ్రెయిన్ వేవ్ టెస్ట్ వంటివి ఉన్నప్పటికీ మైగ్రేయిన్ పెయిన్ ను వైద్యులు ఈ పరీక్షలు అవసరం లేకుండా సులభంగానే గుర్తించగలరు. మైగ్రేయిన్ ఎంత తరచుగా వస్తోంది, వచ్చిన తర్వాత ఎంత సమయం పాటు ఉంటోంది, నొప్పి తీవ్రత ఇతర లక్షణాలను బట్టి మందులు సూచించడం జరుగుతుంది. మైగ్రేయిన్ కు పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవో కొన్ని సందర్భాల్లో తప్పితే ఇది మందులకు లొంగే నొప్పిగానే చెబుతారు. అధిక అలసట కారణంగా, శృంగార సమయంలో తీవ్రమైన తల నొప్పి వస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.
మైగ్రేయిన్ ను ప్రేరేపించేవి

ముందే తెలుసుకోవచ్చు...
మైగ్రెయిన్ నొప్పి రావడానికి ముందు మలబద్ధకం, ప్రవర్తన పరమైన మార్పులు, ఎక్కువ ఆహారం తీసుకోవాలని అనిపించడం, దాహం, మూత్ర విసర్జన పెరగడం వంటివి కనిపిస్తాయి. అందరిలోనూ ఇలానే కనిపించాలని లేదు.
వచ్చే రిస్క్ ఎవరికి?
25 శాతం మందికి తమ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో మైగ్రేయిన్ నొప్పి అనుభవమే. దీని బాధితులు ఎక్కువగా మహిళలే. యవ్వన దశలోకి ప్రవేశించిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి నలుగురు బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు. జన్యుపరంగా మార్పులు, కుటుంబంలో పెద్దవారికి ఉంటే తర్వాత తరం వారికి ఇది రావడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులకు కూడా మైగ్రెయిన్ తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఇది చాలా తక్కువ శాతమే.
మైగ్రేయిన్, ఆందోళన నొప్పి మధ్య తేడా
మైగ్రేయిన్ తల నొప్పికి, ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పికి మధ్య తేడా ఉంది. ఆందోళన కారణంగా వచ్చే నొప్పి పెరుగుతూ, తగ్గుతూ ఉండదు. ఒత్తిడి, పట్టేసినట్టు ఉంటుంది. నొప్పి తీవ్రత తక్కువ నుంచి మధ్యస్తంగా ఉండొచ్చు. మైగ్రేయిన్ మాదిరిగా శారీరక శ్రమ వల్ల ఈ నొప్పి పెరగదు. ఇక వాంతులు, వికారం వంటివి కూడా ఉండవు.
మీకు మీరే గుర్తించాలి

ఈ జాగ్రత్తలతో దూరం...

గర్భిణుల్లో
గర్భం దాల్చిన తర్వాత మైగ్రేయిన్ సమస్య తగ్గిపోవడం సాధారణంగా చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పులే కారణం. ఒకవేళ గర్భంతో ఉన్నప్పుడు మైగ్రేయిన్ నొప్పి వస్తే సొంతంగా టాబ్లెట్లు వేసుకోకూడదు. అవి గర్భంలో ఉన్న పిండానికి హాని కలిగిస్తాయి. వైద్యుల సూచనతోనే ఏ టాబ్లెట్ అయినా వేసుకోవాలి.
మైగ్రేయిన్ లో కడుపు నొప్పి

అశ్రద్ధ మంచిది కాదు
తరచుగా తలనొప్పి వస్తుంటే ముందుల షాపు నుంచి మందులు తెచ్చుకుని వేసుకునే అలవాటు మంచిది కాదు. రక్తపోటు, రక్త ప్రసారంలో అవాంతరాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మెదడులో కణితులు ఇలా ఎన్నో కారణాల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి వాస్తవానికి ఓ నక్సలైట్: విరుచుకుపడిన తృణమూల్
2 minutes ago
Advertisement 36

'దృశ్యం 3' ఎలా?... జితూ జోసఫ్ ప్రశ్నకు వచ్చిన సమాధానాల్లో కొన్ని!
7 minutes ago

పిడకలతో పొగవేస్తే ఇల్లంతా పరిశుభ్రం అయిపోతుంది: మధ్యప్రదేశ్ మంత్రి
22 minutes ago

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు... అత్యధికులు గైర్హాజరయ్యే అవకాశం!
43 minutes ago

ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన.. కేంద్రానికి లేఖ రాసి మరో రైతు ఆత్మహత్య
45 minutes ago

వరుడికి కానుకగా ఎండ్లబండి.. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాదు సుమా!
1 hour ago

జూమ్ కాల్ ఆన్ లో ఉండగా భోజనం లాగించేసిన న్యాయవాది... సొలిసిటర్ జనరల్ సరదా కామెంట్స్.. వీడియో ఇదిగో!
1 hour ago

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా
1 hour ago

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహిళ.. కోటి రూపాయలు సమర్పించుకుని మోసపోయిన వృద్ధుడు!
1 hour ago

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... మహాశివరాత్రి సందర్భంగా 'ఆచార్య' నుంచి తొలి సాంగ్!
1 hour ago

రాజకీయ దుమారం రేపుతున్న జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ ట్వీట్
2 hours ago

పెరుగుతున్న కరోనా కేసులు... తమిళనాడు కీలక నిర్ణయం!
2 hours ago

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
2 hours ago

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసులో మలుపు!
2 hours ago

మహిళను నమ్మించి, రూ. 21 లక్షలు నొక్కేసిన కోయ పూజారులు!
2 hours ago

కరోలినా మారిన్ చేతిలో మరోసారి ఓడిన పీవీ సింధు!
2 hours ago

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పెద్దన్న కన్నుమూత
2 hours ago

మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుతున్న ఇండియా!: పొగడ్తల వర్షం కురిపించిన యూఎస్ శాస్త్రవేత్త1
2 hours ago

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. కత్తులతో వీధుల్లో అల్లరి మూకల హల్చల్.. ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!
3 hours ago

హెలికాప్టర్ కూలిన ఘటనలో ఫ్రెంచ్ బిలియనీర్ ఓలివర్ దస్సాల్ట్ దుర్మరణం!
3 hours ago