మీది ఏ రకమైన జ్ఞాపకశక్తి అన్నది తెలుసా.. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?

01-03-2017 Wed 15:42

మిగతా జీవ ప్రపంచం నుంచి మనుషులకు ప్రత్యేకత వచ్చింది మెదడు అభివృద్ధి చెందడం వల్లే. జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యాలే మన జీవనానికి ఆధారం. ఏదైనా అంశాన్ని నిక్షిప్తం చేసుకుని.. సమయం, సందర్భానికి తగినట్లుగా తిరిగి గుర్తు చేసుకోవడమే జ్ఞాపకశక్తి. సాధారణంగా మొక్కలు సహా అన్ని జీవరాశులకూ జ్ఞాపకశక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ అది కొన్ని రకాల జ్ఞాపకశక్తి మాత్రమే. మన మెదడు మాత్రం చాలా రకాలైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుంది. ఇందులోనూ కొంత మందికి ఒక్కో తరహా జ్ఞాపకశక్తి ఎక్కువగా, మరో తరహా జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది.

- మన నిత్య జీవిత అలవాట్లు, మన చుట్టూ ఉండే వాతావరణం, తీసుకునే ఆహారం, ఉద్యోగం, వృత్తి, చిన్నప్పటి నుంచీ పెరిగిన పరిస్థితులు వంటివి మన జ్ఞాపకశక్తి తీరును, ఏ తరహా జ్ఞాపకశక్తి అధికంగా ఉండాలన్న దానిని నిర్ణయిస్తాయి. మరి ఈ జ్ఞాపకశక్తి రకాలు, కారణాలు, లోపాలు, పెంచుకోవడానికి ఉన్న మార్గాలు, జాగ్రత్తలు వంటి విషయాలను తెలుసుకుందాం..


గుర్తు పెట్టుకోవాలనుకున్నా.. వద్దన్నా గుర్తుంటాయి
పదేళ్ల కిందట ఏం జరిగిందో గుర్తుండడం, రెండు రోజుల కింద ఎవరో కొత్తగా పరిచయం కావడం, పొద్దున ఇంట్లో బైక్ తాళం చెవులు ఎక్కడ పెట్టారో తెలియడం, పరీక్షల కోసం చదవడం.. ఇవన్నీ ఒక్క జ్ఞాపకశక్తిలో భాగమే అనుకుంటుంటాం. కానీ కొన్ని అంశాల ఆధారంగా జ్ఞాపకశక్తిని వేర్వేరుగా విభజించారు. సాధారణంగా జ్ఞాపకశక్తిని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి అని రెండు రకాలుగా చెప్పవచ్చు. రోజూ మనం చూసే, వినే, స్పర్శించే అంశాలన్నీ అప్పటికప్పుడే మెదడులో స్వల్పకాలిక జ్ఞాపకంగా నమోదవుతాయి. ఇలాంటి జ్ఞాపకాల్లో ముఖ్యమైనవి, ఇష్టమైనవి, బాధాకరమైనవి, అంత ముఖ్యమైనవి కాకున్నా తరచూ చేసే పనులు దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారుతాయి. ఉదాహరణకు మన పిల్లల పుట్టిన రోజులు ముఖ్యమైనవి కాబట్టి దీర్ఘకాలిక జ్ఞాపకంగా ఉంటాయి. సైకిల్ తొక్కడం, షూ లేసులు కట్టుకోవడం వంటి మనం రోజూ చేసే పనులు అంత ప్రధానమైనవి కాకున్నా దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారుతాయి. తరచూ చేసే కొన్ని పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు మెదడే వాటిని దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి మార్చుతుంది.

స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ)
కొద్ది రోజుల కింది నుంచి కొద్ది నిమిషాల కింద వరకు చూసిన, విన్న, అనుభూతి చెందిన ఘటనలను గుర్తుంచుకోవడమే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ). ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఆయా పరిస్థితులను, ప్రాధాన్యతను బట్టి గుర్తుంచుకునే సమయం మారుతుంది. ఆరోగ్య కారణాలు, గాయపడడం, కొన్ని రకాల మందులు, బాధాకరమైన, భయానకమైన ఘటనలకు లోనవడం వంటి వాటి కారణంగా కొందరికి ఈ స్వల్పకాలిక జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. దానిని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. అలాంటివారు ఎప్పుడో ఏళ్ల కింద జరిగిన వాటిని కూడా గుర్తు చేసుకోగలరు. కానీ ఐదు నిమిషాల కింద జరిగిన ఘటనలను, చూసిన అంశాలను గుర్తు చేసుకోలేరు.
 • ఈ మెమరీని పెంచుకోవాలంటే ఆయా అంశాలు, విషయాలను వెంట వెంటనే గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా ఎక్కువసార్లు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే.. సులువుగా గుర్తుంటాయి. లేదా సమయం మీరిన వెంటనే గుర్తుకువస్తాయి.
ఇంప్లిసిట్ మెమరీ
మన నిత్య జీవితంలో తరచూ జరిగే, తరచూ చేసే అంశాలు ఇంప్లిసిట్ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఏదైనా ముఖ్యమైన పనిచేస్తున్నప్పుడు మెదడు పెద్దగా దృష్టి పెట్టకుండా, విశ్లేషించకుండానే పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చి.. వాటికి తగినట్లుగా మనం స్పందించేలా చేస్తుంది. ఉదాహరణకు క్రీడాకారులు, ప్రొఫెషనల్ డ్రైవర్లు అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి చాలా వేగంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి మెదడు అంతకుముందటి అనుభవాలను వెంటనే గుర్తు చేసి, ప్రతిస్పందించేలా చేస్తుంది. ఇదే ఇంప్లిసిట్ మెమరీ. సుదీర్ఘకాలం ఆయా అంశాలకు దూరంగా ఉంటే అవి ఇంప్లిసట్ మెమరీ నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది.
 • ఇంప్లిసిట్ మెమరీని పెంపొందించుకోవడానికి మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి మనకు అత్యంత అవసరమైన అనుభవాలు, అవసరాలకు సంబంధించినవి అయి ఉంటాయి. అయితే ఏదైనా అంశాన్ని మనం తరచూ గుర్తు చేసుకుంటే, చేయడానికి ప్రయత్నిస్తుంటే అవి ఇంప్లిసిట్ మెమరీలోకి చేరుతాయి.
ప్రొసెడ్యురల్ మెమరీ
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంప్లిసిట్ మెమరీకి అదనమని చెప్పవచ్చు. ఇంప్లిసిట్ మెమరీ అత్యంత ప్రాధాన్య అంశాలను గుర్తుంచుకుంటే.. ప్రొసెడ్యురల్ మెమరీ అంత ప్రాధాన్యం కాని, నిత్యం చేసే పనులను నిక్షిప్తం చేసుకుంటుంది. నడవడం, మాట్లాడడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, మెట్లెక్కడం, కరెంటు స్విచ్ వేయడం, ఎవరైనా ఎదురుగా వస్తే పక్కకు తప్పుకోవడం వంటి మనం ఆటోమేటిగ్గా చేసే పనులన్నీ ఈ మెమరీలో నిక్షిప్తం అవుతాయి. మెదడు దెబ్బతిన్న పరిస్థితులలో కూడా ఈ మెమరీ నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్లే ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల మెదడు దెబ్బతిన్నవారు తమ పేరు, చిరునామా వంటివి మర్చిపోయినా.. సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి చేయగలరు.
 • మనకు అవసరమైన ఒకే పనిని తరచూ చేస్తుండడం, ప్రయత్నిస్తుండడం వల్ల అవి ఇంప్లిసిట్ మెమరీలో చేరి ప్రొసెడ్యురల్ జ్ఞాపకంగా మారి నిక్షిప్తమవుతాయి. నిరంతరం శిక్షణ, ప్రయత్నం, అనుభవాలతోనూ ఈ జ్ఞాపకాలు నిల్వ చేయబడతాయి.
ఎక్స్ ప్లిసిట్ మెమరీ/డిక్లరేటివ్ మెమరీ
రోజూ చూసేవే, చేసేవే అయినా కొంచెం ప్రయత్నిస్తేగానీ గుర్తుకురాని జ్ఞాపకాలను డిక్లరేటివ్ లేదా ఎక్స్ ప్లిసిట్ మెమరీగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఏదైనా ఘటనలో దెబ్బతిన్న వ్యక్తి ఎవరినీ గుర్తుపట్టకపోయినా ఏ ఇబ్బందీ లేకుండా బైక్ నడుపుతారు. కానీ తను వెళ్లాల్సిన మార్గాన్ని మాత్రం రెండు మూడు సార్లు ప్రయత్నిస్తేగానీ గుర్తుకు తెచ్చుకోలేరు. ఇందులో రెండు రకాల మెమరీ ఉంటుంది. ఒకటి ఎపిసోడిక్, రెండోది సెమాంటిక్.
 • ఎపిసోడిక్ మెమరీ అంటే మనకు సంబంధమున్న ఏదైనా ప్రత్యేక ఘటన, తేదీ, అంశానికి సంబంధించిన మెమరీ. ఉదాహరణకు మన దగ్గరి బంధువుల పెళ్లి, పుట్టినరోజు తేదీలు, చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ టీచర్ల పేర్లు, మనం పెంచుకున్న కుక్కపిల్ల పేరు ఇలాంటివి. ఇందులో విశ్లేషించాల్సిన అవసరం ఏదీ ఉండదు. కానీ మనం ఆ అంశానికి ఇచ్చే ప్రాధాన్యం, మన ఇష్టాయిష్టాలు గుర్తుంచుకునే అంశాలను నిర్ణయిస్తాయి. ఇది దీర్ఘకాలిక మెమరీ అయినా.. ఎక్కువకాలం గుర్తుచేసుకోకపోతే మరిచిపోయే అవకాశం ఉంటుంది.
 • సెమాంటిక్ మెమరీ అంటే సాధారణమైన విషయాలే అయినా.. వాటికుండే ప్రత్యేక లక్షణాలు, విశ్లేషణ ఆధారంగా గుర్తు పెట్టుకోవడం. వ్యక్తిగత అంశాలతో దీనికి సంబంధం ఉండదు. ఉదాహరణకు ఒక ఫొటోలో కుక్క తలను, పిల్లి శరీరాన్ని కలిపి చూపిస్తే.. అదేదో వేరే జంతువు అనుకోకుండా తల కుక్కది, శరీరం పిల్లిది అని గుర్తించగలగడం. ఆకాశం నీలం రంగులో ఉంటుందని గుర్తుండడం. ఈ మెమరీలో నిక్షిప్తమైన అంశాలు కొంత విశ్లేషణతో కూడి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక మెమరీలో ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటాయి. మెమరీలో నిక్షిప్తమయ్యే సమయంలోనే పూర్తి స్పష్టతతో కూడిన జ్ఞాపకాలు కాబట్టి సెమాంటిక్ మెమరీలో చేరినవాటిని మనం దాదాపుగా మర్చిపోయే అవకాశం ఉండదు.
 • సాధారణంగా బాల్యంలో ప్రతి దీర్ఘకాలిక జ్ఞాపకం తొలుత ఎపిసోడిక్ మెమరీగానే నిల్వ అవుతుంది. కానీ ఆ అంశాలను విశ్లేషణాత్మక కోణంలో చూసినప్పుడు, విశ్లేషించినప్పుడు అది సెమాంటిక్ మెమరీగా మారుతుంది. ఉదాహరణకు పిల్లల చేతికి ఒక బంతిని ఇస్తే.. దానిని అన్నింటిలాగా సాధారణంగానే చూస్తారు. అదే బంతిని కింద కొడితే పైకి ఎగురుతుంది, మెత్తగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుందనే విషయాలను విశ్లేషిస్తే దానిని ప్రత్యేకంగా గుర్తిస్తారు.
శరీరాన్ని కాస్త శ్రమ పెట్టండి
సోమరిగా, కదలకుండా కూర్చోవడం వల్ల మెదడు మొద్దుబారిపోయి జ్ఞాపకశక్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుండడం మంచిదని.. లేకపోతే రోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఫిట్ గా ఉండడంతోపాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
 • చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే.. శరీరంలో ఒక్కసారిగా శక్తి విడుదల అవుతుంది. కొంత సమయం తర్వాత బాగా తగ్గిపోతుంది. అది మెదడుకు ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్ల ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 • సరైన పోషకాహారం అందకపోతే కూడా మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి.
 • ఊబకాయం, మధుమేహం (షుగర్), హైపర్ టెన్షన్, అధికంగా సిగరెట్లు తాగడం వంటివి మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. అందువల్ల వాటిని నియంత్రించుకుంటే మంచిది.
 • ఆల్కహాల్, పొగాకు వినియోగం వల్ల మెదడులో చురుకుదనం తగ్గిపోతుంది.
మెదడు చురుగ్గా ఉండాలంటే..
 • ఏదైనా విశ్లేషణాత్మకంగా, బాగా ఆలోచించేందుకు తోడ్పడే పజిల్స్, సూడొకు వంటివి ప్రయత్నించండి.
 • ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి. కొత్త విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండి.. నేర్చుకునే అలవాటును పెంచుతాయి. తద్వారా మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.
 • యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల కూడా మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, ప్రశాంతత చేకూరి జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
 • రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
 •  కాఫీ, టీల వంటివి మెదడు పనితీరును ఉత్తేజితం చేస్తాయి. అందువల్ల ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు కాఫీ తాగితే ఫలితం ఉంటుంది. కానీ కాఫీ, టీలు మోతాదు మించితే కనుక హానికరంగా పరిణమిస్తాయి.
 • చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. శాకాహారులైతే ఆలివ్ ఆయిల్ వినియోగించడం మంచిది.
 • చేపలతోపాటు వాల్ నట్లు, క్యారెట్లు, ద్రాక్ష, పాలకూర వంటివి మెదడుకు ప్రత్యేక ఆహారంగా చెప్పుకోవచ్చు. వయసు మీద పడినవారు వీటిని తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు వంటి వాటిని నిరోధించవచ్చు.


More Articles
Advertisement
Telugu News
Covid third wave likely this month may peak in October
బీ కేర్‌ఫుల్! ఈ నెలలోనే మూడో ఉద్ధృతి.. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక
1 minute ago
Advertisement 36
Sai Pallavi signs a Tamil film
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
13 minutes ago
Amara Raja Group to shift its plant to Tamilnadu from AP
ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనున్న ‘అమరరాజా’!
24 minutes ago
Rotavac 5D Bharat Biotechs rotavirus vaccine receives Prequalification from WHO
భారత బయోటెక్ రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
54 minutes ago
BJP leader Lakshman comments
రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల జలజగడం: బీజేపీ నేత లక్ష్మణ్
9 hours ago
BJP delegation under Somu Veerraju will leave for Delhi tomorrow
సోము వీర్రాజు నేతృత్వంలో ఢిల్లీ వెళుతున్న ఏపీ బీజేపీ బృందం
9 hours ago
Indian student died in China versity
చైనా వర్సిటీలో బీహార్ విద్యార్థి మృతి
9 hours ago
Pawan and Rana starring remake release date confirmed
పవన్, రానా చిత్రం రిలీజ్ డేట్ ఖరారు
10 hours ago
Babul Supriyo says he will continue as MP
ఎంపీగా కొనసాగుతా: మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
10 hours ago
MAA President Naresh responds to Nagababu comments
నాగబాబు వ్యాఖ్యలు చాలా బాధించాయి: 'మా' అధ్యక్షుడు నరేశ్
10 hours ago
Telangana corona cases update
తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు
10 hours ago
Sajjala and Vishnu counters CM KCR comments
కృష్ణా జలాల వివాదం: కేసీఆర్ పై విరుచుకుపడిన సజ్జల, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
11 hours ago
Kadapa police arrests online cheater
ఆన్ లైన్ రోమియో ఆటకట్టించిన కడప పోలీసులు
11 hours ago
Vijay Raghavan trailer released
'విజయ రాఘవన్' నుంచి ట్రైలర్ రిలీజ్!
12 hours ago
Kamal Preet disappoints in discus throw finals
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల డిస్కస్ త్రో ఫైనల్స్ లో భారత్ కు నిరాశ
12 hours ago
Chiranjeevi helps Tollywood co director Prabhakar
30 ఏళ్ల కిందట తనతో పనిచేసిన కోడైరెక్టర్ ను ఆదుకున్న చిరంజీవి
12 hours ago
Sarkaru Vaari Paata movie update
కొత్త రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ మూవీ పోస్టర్!
12 hours ago
All set for Telangana EAMCET
ఎల్లుండి నుంచి తెలంగాణ ఎంసెట్... సర్వం సిద్ధం
12 hours ago
AB Venkateswararao issues legal notices to Vijayasai Reddy
విజయసాయిరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు
13 hours ago
Bandi Sanjay padayatra postponed
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
13 hours ago