సమాజంలో ఆడపిల్లల పట్ల ఆలోచన ధోరణి మారాలి: సునీతా లక్ష్మారెడ్డి

Related image

సోమవారం హైదరాబాద్ లోని బాలంరాయ్ కమ్యూనిటీ హాల్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మరియు యాక్షన్ ఎయిడ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లల పట్ల ఆలోచన ధోరణి మారాలని అన్నారు. ఆడపిల్లల ప్రాముఖ్యత, అవకాశాల కల్పన, అసమానతల నిర్మూలన, ఆడపిల్లల హక్కులు, గౌరవం మొదలైన అంశాలపై అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు.

‘‘ఆడపిల్లలను పుట్టనిద్దాం.. బ్రతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించినప్పుడే బాలికలు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని అన్నారు. ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందించేవారు.. కానీ ఆ తర్వాత మారిన సామాజిక పరిస్థితుల కారణంగా అమ్మాయి పుడితే అమ్మో ఆడపిల్లా.. అనేలా సమాజం అయిందని వీటన్నిటిని నిర్మూలించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మహిళలకు ఏ సమస్యా వచ్చిన మహిళ కమీషన్ అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమీషన్ సభ్యురాలు షాహిన్ అఫ్రోజ్, సెక్రెటరీ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases