మంచి ఆహారంతోనే వృద్ధిచెందే రోగనిరోధక శక్తి: కిమ్స్ సవీరా ఆసుపత్రి క్లినికల్ డైటీషియన్

Related image

  •  కొవిడ్ సమయంలో పాటించాల్సిన ఆహార నియమాలివీ
  • కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యుల సూచనలు
అనంతపురం, జనవరి 24, 2022: సరైన ఆహారం సరైన మొత్తంలో తినడం మన ఆరోగ్యానికి చాలా కీలకం. కోవిడ్ మహమ్మారి మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ముఖ్యమని అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రి క్లినికల్ డైటీషియన్ టిఐ నాగలక్ష్మి సూచించారు. ఏ ఆహారం గానీ, ఇతర సప్లిమెంట్లు గానీ తీసుకున్నా కరోనా రాకుండా నిరోధించలేవని, అయితే.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలపడి, వ్యాధితో పోరాడేందుకు సానుకూలంగా ఉంటుందని ఆమె చెప్పారు.

 ఆ వివరాలు ఇవీ:

స్థానికంగా దొరికే ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. ఆహారధాన్యాలు, సీజన్ల వారీగా దొరికే కూరగాయలు, పండ్లు తినాలి.  రోజుకు కనీసం 5సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. మధుమేఖ రోగులు, కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్ల వాడకం వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరిగినవాళ్లయితే మాత్రం కొన్ని రకాల పండ్లు మాత్రమే తినాలి. చాలావరకు పండ్లు, కూరగాయల్లో విటమిన్ ఎ, సి, డి, బీకాంప్లెక్స్, జింక్, సెలీనియం లాంటివి ఉంటాయి. ఇవన్నీ మన రోగనిరోధక శక్తి పెరగడానికి చాలా కీలకం.

పండ్లు, కూరగాయల్లో తగినమొత్తంలో నీరు, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు ఉండి.. రక్తపోటు, మధుమేహం, అధికబరువును నియంత్రిస్తాయి. ఈ మూడూ కూడా కొవిడ్-19 లక్షణాల్లో కొన్నింటికి ముప్పుకారకాలు. రోజువారీ ఆహారంలో మాంసం, చేపలు, కాయధాన్యాలు, బీన్స్, పాల పదార్థాలు, పప్పులు, విత్తనాలు, కోడిగుడ్లు, పుల్లటి పండ్లు (ఉదా:  నిమ్మ, నారింజ, బత్తాయి), కివీ, స్ట్రాబెర్రీలు, ఇంకా బ్రొకోలి, కాలిఫ్లవర్, గుమ్మడి, తోటకూర, చిలకడదుంప, కారట్ లాంటి కూరగాయల్లో ఈ సూక్ష్మపోషకాలు తగిన మొత్తంలో ఉంటాయి.

మరోవైపు, మోనో అన్శాచ్యురేటెడ్, పాలీ అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కూడా రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఒమెగా-3 పాలీఅన్శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్లు చేపలు, రొయ్యల లాంటివాటిలో బాగా ఉంటాయి. అవిసెలు మన కణాల్లోని రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేయడం ద్వారా దాన్ని పెంచుతాయి. ఒమెగా-9 మోనో అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఆలివ్, సన్ఫ్లవర్, శాఫ్లవర్ నూనెల్లో ఉంటాయి. ఇక పప్పుల్లో అయితే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలుంటాయి. పప్పులు, బ్రెడ్, ధాన్యాలు, మాంసం, పాల పదార్థాలు, చేపలు, కోడిగుడ్లలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ మసాలాలు, మూలికలు, ఇతర మసాలాలు కూడా రోగనిరోధకశక్తిని పెంచేవే. వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలు.. బిస్కట్లు, చీజ్, కేకులు, బేకరీ వస్తువులు, కార్బొనేటెడ్ డ్రింకులు, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవడం తగ్గించండి. తగినంత నీరు కూడా ఎప్పుడూ తాగుతుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లకైనా రోగనిరోధక శక్తి బాగా స్పందిస్తుంది. 

More Press Releases