సీఎం ఆలోచనా విధానం మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ సమర్థవంతంగా పని చేయాలి: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనా విధానం మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ సమర్థవంతంగా పని చేయాలని, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. గత ఏడాది కాలంగా కమిషన్ బాగా పని చేస్తోందని, మహిళా సమస్యల పరిష్కారంలో దేశంలో మన రాష్ట్ర కమిషన్ ముందంజలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నేడు బుద్ధ భవన్ లో జరిగిన కమిషన్ వార్షికోత్సవంలో పాల్గొని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాటలు:

  • రాష్ట్ర మహిళా కమిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులకు శుభాకాంక్షలు
  • చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గారికి మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నేతగా మంచి అనుభవం ఉంది. ఆమె అనుభవం ఈ కమిషన్ కు ఎంతో ఉపయోగపడుతుంది
  • మహిళల సమస్యలపై అవగాహన ఉన్న వారు సభ్యులుగా ఉండడం వల్ల రాష్ట్ర మహిళల సమస్యల పరిష్కారంలో మేలు జరుగుతుంది
  • కమిషన్ చైర్ పర్సన్, సభ్యులకు క్షేత్ర స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్నందున కమిషన్ వద్దకు వచ్చే వారికి చాలా పరిష్కారాలు జరుగుతున్నాయి
  • ఈ రాష్ట్రంలో మహిళల భద్రత, పోషణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి నేతృత్వంలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, వారి రక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు
  • సమాజంలో మహిళలకు రక్షణ ఉండాలంటే సమాజంలో, ముఖ్యంగా మగవాళ్లలో మార్పు రావాలి
  • మహిళల రక్షణ కోసం ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా అక్కడక్కడ జరిగే కొన్ని సంఘటనలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయి
  • మహిళా సమస్యల పరిష్కారంలో మన మహిళా కమిషన్ దేశంలో చాలా ముందంజలో ఉంది
  • సమాజంలో పురుషులతో పాటు మహిళలను సమానంగా వృద్ధిలోకి తీసుకు రావడం కోసం సీఎం కేసిఆర్ గారు పని చేస్తున్నారు
  • మహిళలు ఎక్కడ పూజింప బడుతరో అక్కడ దేవతలు ప్రత్యక్షై అవుతారన్న నానుడి మేరకు సమాజం ఉండాలి
  • మహిళకు మరింత మేలు చేసే విధంగా పని చేస్తాం
  • ఇక్కడకు వస్తే పరిష్కారం అవుతుందని నమ్మకం కల్పించాలి
  • మహిళకు యూనివర్సిటీ ఉండాలి అని కేబినెట్లో చెప్పినప్పుడు సీఎం కేసిఆర్ గారు ఒప్పుకుని వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు
కమిషన్ వార్షికోత్సవం సందర్భంగా వార్షిక నివేదిక విడుదల చేసి, మహిళలపై రూపొందించిన పాట సీడిని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది, వివిధ మహిళా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదివాసి, గిరిజన ప్రకృతి వైద్యాన్నిపరిరక్షించాలి: మంత్రి సత్యవతి రాథోడ్ శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో వృద్ధి చెందినా అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశస్త్యం మరింత పెరిగిందని, ఇలాంటి వైద్యాన్ని తగిన రీతిలో గుర్తించి, భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలన్నారు. ఆదివాసీ సంప్రదాయక వైద్యరీతులపై నేడు ఆన్ లైన్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జాతీయ వర్క్ షాప్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రసంగించారు.

ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా జరిగే వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉండవని, అందుకే దీనికి ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతుందన్నారు. అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రకృతి వైద్యం పొందడం వల్ల వందేళ్లకు పైగా జీవించారని, మంచి జీవన ప్రమాణాలతో వందేళ్లకు పైగా జీవించారన్నారు.

ఈ ఆహార విధానాన్ని, వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం దీనిపై మరింత పరిశోధన చేయాలన్నారు. స్థానిక యువతకు అవగాహన కల్పించి సంరక్షించాలన్నారు. కొత్త, కొత్త రోగాలు, జబ్బులు వస్తున్న నేపథ్యంలో ఆ ఆదివాసీ, గిరిజన వైద్యం ద్వారా పరిష్కారం వస్తుందా? అనేది పరిశీలించాలన్నారు.

ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అధికారులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

More Press Releases