కేబీఆర్ పార్కులో ఘనంగా పికాక్ ఫెస్టివల్

03-12-2021 Fri 17:27

  • పెద్ద సంఖ్యలో హాజరైన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు
  • అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై పిల్లలకు అవగాహన, డ్రాయింగ్, పెయిటింగ్, స్నేక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు
హైదరాబాద్ నగరానికి ప్రకృతి మణిహారంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో ఘనంగా నెమలి దినోత్సవం (పికాక్ ఫెస్టివల్) జరిగింది. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున (3 డిసెంబర్ 1998లో) కేంద్ర ప్రభుత్వం కేబీఆర్ పార్కును జాతీయ ఉద్యానవనంగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సుమారు 360 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జంతు జాతులు ఉండటంతో, వాటిని పరిరక్షించటంలో భాగంగా నేషనల్ పార్కుగా ప్రకటించారు. అలాగే ఇక్కడ ఉన్న జంతువులు, పక్షి జాతుల్లో ఎక్కువగా జాతీయ పక్షిగా గుర్తించిన నెమలి ఉండటంతో, కేబీఆర్ జాతీయ ఉద్యానవనం ఏర్పాటుకు గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 3న అటవీ శాఖ పికాక్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

ఈ పార్కుకు వచ్చే సందర్శకులకు, వాకర్స్ కు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ విరివిగా కనిపించే నెమళ్లే.. ఈ యేడు జంతుగణనలో ఐదు వందలకు పైగా నెమళ్లు కేబీఆర్ పార్కులో ఉన్నట్లు నమోదు అయింది. వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా చిన్న పిల్లల్లో అడవులు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అటవీ శాఖ ప్రతీ యేటా నిర్వహిస్తోంది.

వివిధ స్కూళ్ల నుంచి వందలాది మంది పిల్లలు ఈసారి పికాక్ ఫెస్టివల్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాల్గొన్నారు. ఫ్రెండ్న్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు నిర్వహించిన స్నేక్ షో లు వివిధ రకాల పాములు, అవి వ్యవహరించే తీరును పిల్లలకు వివరించారు. అలాగే అడవులు, జంతువులకు సంబంధించిన డ్రాయింగ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు అటవీ శాఖ అధికారులు బహుమతులను అందించారు.

స్కూలు పిల్లలు పర్యావరణ అంబాసిడర్లుగా వ్యవహరించాలని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడ అని గుర్తించాలని కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ అన్నారు. ప్రతీ ఒక్కరిలో పర్యావరణ స్ఫృహ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్ట్ పార్కులను (109) అభివృద్ది చేస్తోందని గుర్తు చేశారు. స్కూలు పిల్లలకు వారి రెగ్యులర్ సిలబస్ తో పాటు పర్యావరణం, జంతు సంరక్షణపై టీచర్లు అవగాహన కల్పించాలని హాజరైన టీచర్లను పీసీసీఎఫ్ ప్రత్యేకంగా కోరారు.

కార్యక్రమంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే. సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, డీఎఫ్ఓ జోజి, ఓఎస్డీ శంకరన్, రేంజ్ ఆఫీసర్ అనురాధ, ఇతర అధికారులు, సిబ్బందితో పాటు  వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, టీచర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.  


More Press Releases
ఇంటింటి సర్వేను పరిశీలించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
1 hour ago
సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్ని కోట్ల నిదులైనా ఖర్చు చేస్తాం: మంత్రి తలసాని
1 hour ago
ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఆకర్షించేలా రాజీవ్ గాంధీ పార్కును తీర్చిదిద్దాలి: విజయవాడ మేయర్
1 hour ago
Amrita Vishwa Vidyapeetham launches online course on Hinduism
6 hours ago
గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష
23 hours ago
India successfully test fires BrahMos supersonic cruise missile off Odisha coast
1 day ago
Paradise in Malkajgiri becomes the next signature outlet in Secunderabad
1 day ago
PM to unveil 216-ft statue of equality in Hyderabad on February 5, 2022
1 day ago
Rajamahendravaram gets its first Paradise outlet
1 day ago
2023 మార్చిలోగా ఆరాంఘర్-జూపార్క్ ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
1 day ago
కరోనా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు: మంత్రి జగదీష్ రెడ్డి
1 day ago
Simpliforge launches India’s first state-of-the-art Robotic Concrete 3D Printer at Charvitha Meadows
2 days ago
సీఎం ఆలోచనా విధానం మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ సమర్థవంతంగా పని చేయాలి: మంత్రి సత్యవతి రాథోడ్
2 days ago
పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యత, తమ వంతుగా అందరూ మొక్కలు నాటాలి: పద్మ శ్రీ వనజీవి
2 days ago
ఆప్కో క్యాటలాగ్ ఆవిష్కరించిన మంత్రి మేకపాటి
2 days ago
Doctors at Aware Gleneagles Global Hospital save life of young girl suffering from deadly fungal infection
2 days ago
Radico Khaitan brings cheer with the “Celebration Pack” for Morpheus Brandy this New Year
3 days ago
గురునానక్ నగర్ స్విమ్మింగ్ ఫూల్ ఆధునికీకరణ పనులు పరిశీలించిన వీఎంసీ కమిషనర్
3 days ago
Mahindra announces 'Get Highest Mileage or Give Truck Back' guarantee on its entire HCV, ICV & LCV Truck Range
3 days ago
Hyderabad FC B finish runners up in CEM Gold Cup 2022
3 days ago
స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక స్పందన: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
4 days ago
Hyundai releases ALCAZAR campaign featuring Shah Rukh Khan & four Indian Cricketers
4 days ago
Sony India announces the latest addition to its 1000X series with WF-1000XM4 Truly wireless earbuds
4 days ago
PM condoles the passing away of legendary Kathak dancer Pandit Birju Maharaj
4 days ago
అభివృద్ధి దిశ‌గా ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణ: చినజీయర్ స్వామి
1 week ago
Advertisement
Video News
తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
15 minutes ago
Advertisement 36
ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారతీయ చిత్రాలు... కుదించిన జాబితాలో జై భీమ్, మరక్కార్
ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారతీయ చిత్రాలు... కుదించిన జాబితాలో జై భీమ్, మరక్కార్
31 minutes ago
సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశాం: సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక
సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశాం: సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక
43 minutes ago
ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు తేదీలు ప్రకటించిన చిత్రబృందం
ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు తేదీలు ప్రకటించిన చిత్రబృందం
1 hour ago
విలన్ గా మహేశ్ తో మళ్లీ తలపడనున్న గోపీచంద్!
విలన్ గా మహేశ్ తో మళ్లీ తలపడనున్న గోపీచంద్!
1 hour ago
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర్ జవాన్ జ్యోతి విలీనం పూర్తి
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర్ జవాన్ జ్యోతి విలీనం పూర్తి
1 hour ago
రాణించిన పంత్, ఠాకూర్, రాహుల్... టీమిండియా భారీ స్కోరు
రాణించిన పంత్, ఠాకూర్, రాహుల్... టీమిండియా భారీ స్కోరు
1 hour ago
'స్టూవర్టుపురం దొంగ' పట్టాలెక్కడట!
'స్టూవర్టుపురం దొంగ' పట్టాలెక్కడట!
1 hour ago
సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు: ఉద్యోగ సంఘాల నేతల స్పష్టీకరణ
సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు: ఉద్యోగ సంఘాల నేతల స్పష్టీకరణ
1 hour ago
ఏపీలో 13 వేలకు పైగా కరోనా రోజువారీ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
ఏపీలో 13 వేలకు పైగా కరోనా రోజువారీ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
2 hours ago
రెండు సినిమాలు లైన్లో పెట్టేసిన శ్రీకాంత్ తనయుడు!
రెండు సినిమాలు లైన్లో పెట్టేసిన శ్రీకాంత్ తనయుడు!
2 hours ago
డబ్బింగ్, రీమేక్ మధ్య క్లాష్.. 'అల వైకుంఠపురములో' డబ్బింగ్ వెర్షన్ విడుదల వాయిదా
డబ్బింగ్, రీమేక్ మధ్య క్లాష్.. 'అల వైకుంఠపురములో' డబ్బింగ్ వెర్షన్ విడుదల వాయిదా
2 hours ago
'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఖరారు!
'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఖరారు!
2 hours ago
విజయవాడ డీఆర్ఎంకు లేఖ రాసిన గల్లా జయదేవ్
విజయవాడ డీఆర్ఎంకు లేఖ రాసిన గల్లా జయదేవ్
2 hours ago
కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: అచ్చెన్నాయుడు
కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: అచ్చెన్నాయుడు
3 hours ago
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కరోనా
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కరోనా
3 hours ago
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై హైదరాబాదులో కేసు నమోదు
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై హైదరాబాదులో కేసు నమోదు
3 hours ago
ఉద్యోగులు సమ్మె ప్రకటించిన విషయం మాకు తెలియదు: మంత్రి పేర్ని నాని
ఉద్యోగులు సమ్మె ప్రకటించిన విషయం మాకు తెలియదు: మంత్రి పేర్ని నాని
3 hours ago
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
3 hours ago
వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
4 hours ago