వరి వేసినా ఉరే.. వరి తిన్నా ఉరే: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • ఆదాయాన్నిచ్చే పంటలు వేయాలి
  • ఆరోగ్యాన్ని కాపాడే పంటలను ప్రోత్సాహించాలి
  • డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యత పెంచాలి
  • కంది సాగుకుపెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ
  • ఆదాయాన్ని పెంచుకునేందుకు వేరుశనగ, మంచి శనగలు మేలు
  • ఆయిల్ ఫామ్ లు అధిక ఆదాయాన్నిస్తాయి
నల్లగొండ: ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి వేసినా తిన్నా ఉరి వేసుకున్నట్లేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు కారణం కొనుగోళ్ల విషయంలో కేంద్రం చేతులు ఎత్తి వేయడం కుడా ఒక కారణమని ఆయన చెప్పుకొచ్చారు. అంతే గాకుండా ప్రభుత్వ, ప్రవైట్ గోడౌన్ లు ధాన్యం స్థాక్ తో పూర్తిగా నిండిపోయాయని ఆయన తెలిపారు.

అటువంటి పరిస్థితులలో ఆదాయాన్నిచ్చే పంటలతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పంటలు పండించే దిశగా రైతులు ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని గంగదేవి గూడెంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటిడ్ (ఎఫ్ పి పి)ని ఆయన ప్రారంభించారు.

అనంతరం ఎఫ్ పి పి కార్యాలయంలో స్థానిక రైతులు ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు మల్లడంతో పాటు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం సాగు జరిగేలా చూడాలని ఆయన కోరారు. బలహీనంగా పంటలు ఉన్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులు ఉపకరిస్తాయని అంతిమంగా పంటలకు బలనిచ్చేది సేంద్రియ ఎరువులేనని ఆయన తేల్చి చెప్పారు.

వ్యవసాయం చేసే ప్రతి రైతు పాడి అభివృద్ధి కి దోహదపడాలని ఆయన సూచించారు. గోమాతను పూజించడం అంటేనే భూమాత ను కాపాడుకోవడం అన్నది రైతాంగం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎఫ్ పి పి పరిధిలో రసాయనిక ఎరువుల వాడకాన్ని వదిలి పెట్టి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించి రాష్ట్ర రైతాంగానికి మార్గదర్శనం కావాలని ఆయన పిలుపునిచ్చారు. డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించేందుకు ఈ తరహా రైతు సంఘాలు దోహదపడలన్నారు. ఇక్కడ ప్రారంభమైన ఎఫ్ పి పి లతో ఆరోగ్యాన్ని.. ఆదాయాన్ని ఇచ్చే పంటల వైపు యావత్ రైతాంగం దృష్టి సారించే విదంగా నిర్ణయాలు ఉండాలన్నారు. వరుసగా ప్రభుత్వం కోన్న ధాన్యం కోటానుకోట్ల టన్నుల రూపంలో గోదాములలో నిల్వలు పేరుకుపోయాయన్నారు.

మరింత ఆదాయాన్ని పెంచుకునే దిశగా పంటలు పండించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రేయస్కరం అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదయాన్నిచ్చే కంది, వేరు శనగ, మంచి శనగలతో పాటు ఆయిల్ తోటల పెంపకం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చేతి కింద నీళ్లు అందుబాటులో ఉన్నాయని అటువంటి సమయంలో వాణిజ్య పంటలు ఆదాయాన్ని పెంపొందిస్తాయన్నది రైతాంగం గుర్తించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య, మాజీ శాసనసభ్యుడు నంద్యాల నరసింహా రెడ్డి వ్యవసాయ ప్రతినిధులు పండించిన పంటను యన్ జి ఓ రూపంలో మార్కెటింగ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

More Press Releases