సీఎంఆర్ సవాళ్లను అధిగమించాలి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

Related image

  • ప్రతినెల 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించేలా ప్రణాళిక
హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ)కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించే విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను అధిగమించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ అప్పగింతలో ఎంత జాప్యం జరిగితే కార్పొరేషన్ పై అంత అర్థికభారం పడుతోందని ఈ విషయాన్ని గుర్తించి అధికారులు మరింత క్రియశీలకంగా పని చేయాలని అన్నారు. 2019 - 20 యాసంగి, 2020-21 వానాకాలం సీఎంఆర్ పై సోమవారం నాడు పౌరసరఫరాల భవన్లో కమిషనర్ అనిల్‌కుమార్‌తో కలిసి ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా మేనేజర్లతో సమీక్షించారు.

ఈ సందర్భగా ఛైర్మన్ మాట్లాడుతూ రెండు సీజన్లలో నిర్ణీత గడువులోగా రైసు మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోకపోవడంలో కొంత వరకు ఎఫ్ సిఐ కారణమైతే, కొంత భాగం పౌరసరఫరాల అధికారుల అలసత్వం కూడా ఉందని అన్నారు. ఎఫ్ సిఐ ప్రైమరి వేరిఫికేషన్ (పివి)తో ప్రస్తుతం మిల్లింగ్ నిలిచిపోయిందని ఎఫ్ సిఐతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరంగా పివి పూర్తి చేసుకుని మిల్లింగ్ ప్రారంభమైయ్యేల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి నుంచి ప్రతినెల 10 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ను అప్పగిస్తేనే గడుపులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని, ఇందు కోసం ఇప్పటి నుంచి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

పౌరసరఫరాల సంస్థ మండలస్థాయి గోదాముల్లో ప్రతి నెల పివి నిర్వహించాలని, గన్నీ బ్యాగ్స్, ధాన్యం, బియ్యం అకౌంట్స్ ను  వీలైనంత తర్వంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్, బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు పకడ్బంది చర్యలు తీసుకోవాలని, గోదాములో సిసి కెమెరాలు వంద శాతం పని చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే జిపిఎస్ లేకుండా బియ్యం రవాణా చేయడానికి వీలులేదని ఒకవేళ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సంస్థ జనరల్ మేనేజర్లు రాజారెడ్డి, శ్రీనివాసరావు, కన్సలెటెంట్ అశోక్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు పెన్షన్, ఇన్సూరెన్సు కల్పించాలి: ఉద్యోగుల సంఘం

పౌరసరఫరాల సంస్థలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే మెడికల్ హెల్త్ గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సంస్థ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కి విజ్ఞప్తి చేసింది. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని సంఘం అధ్యక్షుడు గోపి కృష్ణ తెలిపారు.

More Press Releases