ఎల్ అండ్ టీ డ్రెయిన్ నిర్మాణాలలో గల గ్యాప్ లను సత్వరమే పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

Related image

విజయవాడ: నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శుక్రవారం సర్కిల్-3 పరిధిలోని పలు ప్రాంతాలలో ఎల్ అండ్ టీ వారి ద్వారా చేపట్టిన డ్రెయిన్ నిర్మాణ పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. హరిజన వాడ నందలి పుల్లేటి డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ, డ్రెయిన్ నందు గ్యాప్ ఫిల్లింగ్ పనులు అన్నియు సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.

పిన్నమనేని పొల్లిక్లినిక్ రోడ్, టిక్కిల్ రోడ్, గాయిత్రి నగర్, డి.వి.మ్యానర్ రోడ్ నందలి డ్రెయిన్ లను పరిశీలిస్తూ, నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాల విషయమై విద్యుత్ అధికారులతో చర్చించి నిర్మాణానికి అడ్డంగా గల పోల్స్ తరలించి నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. తదుపరి బెంజి సర్కిల్ ట్రెండ్ సెట్ సర్వీస్ రోడ్ లో ప్యాచ్ వర్క్ పనులు తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. పై ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచుటతో పాటుగా మురుగునీటి పారుదలకు అడ్డంగా గల చెత్త మరియు వ్యర్ధములను తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అన్నారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.చంద్ర శేఖర్ మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

'సిటిజన్‌ అవుట్‌ రీచ్‌' ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు:ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను సుగుమం, సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సూచనలకు అనుగుణంగా నగర పరిధిలోని 286 వార్డ్ సచివాలయ సిబ్బంది వార్డ్ వాలెంటరీలతో కలసి క్షేత్ర స్థాయిలో వారికీ కేటాయించిన డివిజన్ లలో పర్యటించి సంక్షేమ క్యాలెండర్ ను లబ్ధిదారులకు వివరించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో, మొబైల్ యాప్ నందు వ్యాక్సిన్ వేసుకోనిన వివరాలు పొందుపరచుట జరిగింది.

సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయుటకై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమము ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌లో ప్రభుత్వ సేవలు, పథకాలను ప్రజలకు వివరించుట జరిగింది. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో ప్రతి ఇంటికి సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారా  ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను ప్రకారం ఏయే నెలలలో, ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్రజలకు క్లుప్తంగా తెలియజేస్తున్నారు. వ్యాక్సినేషన్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు.

More Press Releases