సచివాలయ హెల్త్ సెక్రెటరీలకు మెడికల్ కిట్స్ పంపిణీ చేసిన విజయవాడ మేయర్, కమిషనర్

Related image

విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం నందు ఏర్పాటు చేసిన సచివాలయ హెల్త్ సెక్రెటరీలకు మెడికల్ కిట్స్ పంపిణీ కార్యక్రమములో నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్య లక్ష్మి పాల్గొన్నారు. వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ మరియు ఆరోగ్య శ్రీ ద్వారా సిబ్బందికి మెడికల్ ఎక్యూప్ మెంట్స్ అందజేశారు.

నగర పరిధిలోని 286 సచివాలయంలో గల హెల్త్ సెక్రెటరీలకు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ వారు అందించిన మెడికల్ ఎక్యూప్ మెంట్స్ బి.పి.మిషన్, డిజిటల్ ధర్మ మీటర్స్, మాస్క్ మరియు నగరపాలక సంస్థ ఆరోగ్య శ్రీ ద్వారా అపరాన్, హేమోగోబిన్ టెస్ట్ లతో కూడిన మెడికల్ కిట్స్ లను మేయర్ మరియు కమిషనర్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ కోవిడ్ విపత్కర సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వారు చేసిన సేవలను మరియు వ్యాక్సినేషన్, కొవిడ్ టెస్టింగ్ సమయాలలో వారు అందించిన సేవలను కొనియాడుతూ ఇదే స్పూర్తితో రాబోవు రోజులలో కూడా సేవలను అందించాలని సూచించారు.

కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతభాయి, వరల్డ్ విజన్ ప్రోగ్రాం మేనేజర్ డా.అన్న, సచివాలయాల ఇన్ ఛార్జ్ అధికారి డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు.

పారిశుధ్య నిర్వహణకై 500 వీల్ బర్రోస్ కొనుగోలు, మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ల కేటాయింపు: మేయర్ రాయన భాగ్యలక్ష్మితుమ్మలపల్లి వారి కళా క్షేత్రం వద్ద ప్రజారోగ్య శాఖా ఏర్పాటు చేసిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా నివాసాల నుండి చెత్త సేకరణకై సుమారు 50 లక్షల విలువలతో నూతనంగా కొనుగోలు చేసిన 500 వీల్ బేరర్స్ లను ప్రారంభించి మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ లలోని పారిశుధ్య సిబ్బందికి అందించారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును మెరుగుపరచుటలో భాగంగా చెత్త సేకరణకు ఈ తోపుడు బండ్ల కొనుగోలు చేయుట జరిగిందని పేర్కొన్నారు. డివిజన్ లో ప్రతి ఇంటి నుండి తడి మరియు పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని అన్నారు. కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

గాంధీ కొండను పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వన్ టౌన్ గాంధీజీ పర్వతంపై నగరపాలక సంస్థ చేపట్టవలసిన అభివృద్ధి పనులు అన్నియు సత్వరమే చేపట్టాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలసి గాంధీ హిల్ ను పరిశీలిస్తూ, కాంపౌండ్ వాల్ నిర్మాణ మరియు పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు తదితర అంశాలతో పాటుగా కొండ పై భాగంలో జాయ్ ట్రైన్ కు తగిన మరమతులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా గ్రీనరి అభివృద్ధి లో భాగంగా కార్పెట్ గ్రాస్స్, లాన్ ఏర్పాటు మొదలగు అంశాలతో పాటుగా పాడైన లైట్ ల స్థానములో కొత్త లైట్ లు ఏర్పాటు చేయాలనీ అధికారులకు సూచించారు.

అదే విధంగా గాంధీ కొండ వద్ద రైల్ వే ట్రాక్ దిగువ నుండి ప్రవహిస్తున్న మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ నందు పేరుకుపోయిన చెత్త మరియు వ్యర్ధముల తొలగింపు పనులు పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. డ్రెయిన్ నందు తొలగించిన వ్యర్ధములు వెనువెంటనే అక్కడ నుండి తొలగించాలని అన్నారు. యంత్రముల ద్వారా చెత్త తొలగించుటకు గల అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమములో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases