286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌: వీఏంసీ క‌మిష‌న‌ర్

Related image

  • వ్యాక్సినేషన్ తో కరోనా నియంత్రణ
విజయవాడ: వ్యాక్సిన్ తోనే కరోనా నియంత్రణ సాధ్యమని, న‌గ‌రంలో స్పెష‌ల్‌ డ్రైవ్  ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమము ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని, ప్రతి ఒక్కరు వ్యాక్సినేష‌న్ వేయించుకొవాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ పేర్కొన్నారు. 18 సంవ‌త్స‌రాలు పైబ‌డి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో ప‌రిధిలోని 286 స‌చివాల‌యంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 42900 కోవిషీల్డ్ / కొవ్యాక్షిన్ మొదటి మరియు రెండోవ డోసులు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే శాశ్వ‌త మార్గమని, యువ‌త స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందన్నారు. నగర పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ  వ్యాక్సినేషన్ అందించాల‌నే ల‌క్ష్యంతో వార్డ్ సచివాలయాలు మొదటి / రెండోవ డోస్ గా కోవిషిల్డ్ / కొవాక్షిన్ అందిస్తున్న‌ట్లు అందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు.

More Press Releases