మ‌ట్టితో చేసిన వినాయ‌క విగ్ర‌హాల‌ను మాత్ర‌మే వినియోగిద్దాం: విజయవాడ మేయ‌ర్

Related image

  • ప‌ర్యావ‌ర‌ణాన్ని మ‌న‌మే కాపాడుకుందాం
  • కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి
సిద్ధిని, బుద్ధిని ప్ర‌సాదించే విఘ్నేశ్వరుని పండుగను కులమతాలకు అతీతంగా కోవిడ్ నిబంధ‌న‌లను పాటిస్తూ ఎంతో వేడుకగా జరుపుకోవాల‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్య‌ల‌క్ష్మి పిలుపునిచ్చారు.

చిట్టిన‌గ‌ర్ శ్రీ మహాలక్ష్మి అమ్మ‌వారి దేవ‌స్థానం వ‌ద్ద‌ మరియు 35వ డివిజ‌న్ మ‌సీజ్ సెంట‌ర్‌, డెవిడ్ వీధిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాలలో మేయ‌ర్ అతిధిగా పాల్గొన్ని ప్ర‌జ‌ల‌కు మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను అంద‌జేశారు. మ‌ట్టితో చేసిన వినాయ‌క విగ్ర‌హాల‌ను మాత్ర‌మే వినియోగిద్దాం, మ‌న ప‌ర్యావ‌ర‌ణాన్ని మ‌న‌మే కాపాడుకుంద్దాం అని పిలుపునిచ్చారు.

కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్ బ‌ల‌సాని మునిమ్మ, చిట్టిన‌గ‌ర్ అమ్మ‌వారి దేవ‌స్థానం క‌మిటీ స‌భ్య‌లు, వైసీపీ నాయ‌కులు పి.శ‌ర‌త్‌, త‌దిత‌రులు ఉన్నారు.  

More Press Releases