కొండ ప్రాంతంలో మెట్లుకు మ‌రమ్మ‌తులు చేయండి: వీఎంసీ క‌మిష‌న‌ర్

Related image

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 52వ డివిజ‌న్‌లో క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి ప‌ర్యటించారు. మల్లిఖార్జున పేట కొండ ప్రాంతంలో పర్యటిస్తూ, స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. కొండ ప్రాంతములో మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో మెట్లు త‌క్ష‌ణ‌మే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అదే విధంగా రూ.25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ నిధులతో క‌మ్యూనిటీ హాలు అభివృద్ది ప‌నుల‌కు అంచ‌నాలు సిద్దం చేయాల‌న్నారు. 40 ల‌క్ష‌ల రూపాల‌య‌ల‌తో సిసి రోడ్డు, 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అంత‌ర్గ‌త ర‌హ‌దారుల నిర్మాణానికి టెండ‌ర్‌లు పిలవాల‌న్నారు.

రాఘవయ్య పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:

బందరు రోడ్ నందలి రాఘవయ్య – అంబేద్కర్ పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనుల యొక్క పురోగతిని కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొన్నారు. పార్క్ లలో చేపటిన అన్ని ఇంజనీరింగ్ మరియు గ్రీనరి పనులు అన్నియు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలన్నారు. పార్క్ ను త్వరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆకర్షనియమైన మొక్కలతో పార్క్ సిద్దం చేయాలని అన్నారు.

పర్యటనలో 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ.ప్రాజెక్ట్స్ పి.వీ.కె భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.నారాయణమూర్తి, వి.చంద్ర శేఖర్, ఉద్యానవన శాఖాధికారి జె.జ్యోతి మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More Press Releases