కోటి 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో వెస్ట్ వాట‌ర్ పైపులైన్ ప‌నులు: వీఎంసీ క‌మిష‌న‌ర్

Related image

విజయవాడ: మంచినీటి సరఫరా కేంద్రంలో సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ సిబ్బందికి సూచించారు. విజ‌య‌వాడ‌ నగరానికి మంచినీటి సరఫరా చేసే విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ ను బుధ‌వారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అక్కడ సిబ్బంది తో మాట్లాడుతూ, నగరానికి మంచినీటిని సరఫారా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో విధులు నిర్వహించే సిబ్బంది అన్ని విషయాలలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, కృష్ణానది నుంచి ఇక్కడ నీటిని శుద్ధి చేసే క్రమంలో ఆలం పరిమాణం తగిన మోతాదులో కలపాలని, శుద్ధి అయిన నీటిని ఎప్పటికప్పుడు ల్యాబ్ కి టెస్టులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. హెడ్ వాట‌ర్ వ‌ర్క్స్ నుంచి వెస్ట్ వాట‌ర్ పైపులైన్ ప‌నులను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని ఆదేశించారు.

బైపాస్ రోడ్డులో డ్రైన్లు వ‌ర్ష‌పునీరు పారుద‌ల‌కు అవరోధం ఏర్పడకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. అదే విధంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని చిట్టిన‌గ‌ర్,  మిల్క్ ప్రాజెక్టు, చ‌నుమోలు వెంక‌ట‌రావు ప్లే ఓవర్ బ్రిడ్జి , కబేళా, ఐర‌న్ యార్డు  త‌దిత‌ర ప్రాంతాల‌ల్లో ర‌హ‌దారుల‌పై రాత్రి స‌మ‌యంలో పాద‌చారుల‌కు, వాహ‌న‌దారుల‌కు ఇబ్బంది లేకుండా రెడియం పెయింగ్ చేయాలని అధికారుల‌కు ఆదేశించారు. రహదారులపై ప్రమాదాల నివారణకు గుంతలు పూడ్చ‌డం, మ‌ట్టి దిబ్బ‌లు పూర్తిగా తొలగించాలన్నారు. న‌గ‌రంలో ర‌హ‌దారుల‌పై ఎక్కడి చెత్త లేకుండా పరిసరాల పారిశుధ్యంపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

More Press Releases