నాటుసారా తయారీ, అక్రమ మద్యం వినియోగంపై ఉక్కు పాదం: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ

Related image

అమరావతి: దశలవారీగా మధ్య నియంత్రణ అమలు చేయడానికి,  వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ముందడుగు వేస్తున్నామని, ఈ క్రమంలోనే మద్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో సోమవారం అబ్కారీ, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోల పనితీరుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రజత్ భార్గవ మాట్లాడుతూ గతంలో అబ్కారీ శాఖలో ఎన్ఫోర్స్ మెంట్ కోసం కేవలం 350 మంది సిబ్బంది ఉండేవారని, ఆ సంఖ్యను 5,000 కు పెంచి అబ్కారీ చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు. ఈ క్రమంలో ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో పనితీరును అభినందనీయమన్న రజత్ భార్గవ, నాటుసారా తయారీ, సరఫరా, వినియోగం, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను ఎట్టి పరిస్ధితులలోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ తరహా వ్యవహారాలపై పిడి యాక్ట్ అమలుతో సహా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను ఆదేశించారు.

రాష్ట్రంలో అక్రమ మధ్యం వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఈ తరహా వ్యవహారాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆదేశించారని వివరించారు. 2020-21 సంవత్సరంలో అక్రమ మధ్యం కార్యకలాపాలకు సంబంధించి 59,873 కేసులు నమోదు చేసి 46,872 మందిని అరెస్టు చేయటమే కాక, 7,71,288 లీటర్ల నాటు సారా,  2,19,55,812 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 6,540 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు సమీక్షా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇదే కాలంలో 34,643 సుంకం చెల్లించని మద్యం కేసులు నమోదు చేసి, 50,401 మందిని అరెస్టు చేసామని,  6,98,305 లీటర్ల ఎన్‌డిపిఎల్ స్వాధీనం చేసుకుని 18,744 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు.

స్పెషల్ బ్యూరో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాంతి  భత్రతల పరిరక్షణకు కూడా కృషి చేస్తోందని, సుంకం చెల్లించని మధ్యం సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. మద్యం అక్రమ రవాణాకు అలవాటు పడిన ఐదుగురు వ్యక్తులకు పిడి చట్టం కింద నిర్బంధించగా, ఈ తరహా వ్యక్తులు అందరినీ పిడి యాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రజత్  భార్గవ అదేశించారు.

ఈ విషయంపై తదుపరి సమీక్షలో కీలకంగా చర్చించటం జరుగుతుందని సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో డైరెక్టర్ పిహెచ్‌డి రామకృష్ణ, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి, అబ్కారీ శాఖ అదనపు కమిషనర్ కె.ఎల్. భాస్కర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

పన్ను ఎగవేతదారుల గుర్తింపుతో ఆదాయ పెంపు: రజత్ భార్గవ
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయంలో కొరత నెలకొందని, దానిని పెంచే క్రమంలో కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావలసిన మెత్తాల విషయంలో దృష్టి సారించటంతో పాటు, పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు అవసమైన అన్ని మార్గాలను అన్వేషించాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ స్పష్టం చేసారు.

సెప్టెంబర్ 17 న లక్నోలో జరగబోయే 45 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన సమస్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్, ఆ శాఖ సీనియర్ అధికారులతో సోమవారం సచివాలయంలో రజత్ భార్గవ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సమీక్షలో ఆదాయ పెంపుకు సంబంధించి పాదరక్షలు, ఎరువుల అవుట్‌పుట్‌పై పన్ను ఇన్‌పుట్‌ పన్నురేట్ల కంటే తక్కువగా ఉంటుందని ఇది ఆదాయాన్ని కోల్పోయే సమస్యగా ఉండటమే కాక, ప్రాసెసింగ్ రీఫండ్‌ రూపంలో పరిపాలనా భారం నెలకొంటుందని దీనిని అధికమించాలని సూచించారు.

పన్ను ఎగవేత పద్ధతులను గుర్తించడం కీలకమని, ఇందుకోసం ప్రత్యేక డేటా అధారిత ఉపకరణాలను వినియోగించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేసారు. పన్ను ఎగవేత దారులను పన్ను పరిధిలోకి తీసుకువస్తూ పన్నుల ఆదాయ పెంపు కోసం చేపట్టే ప్రత్యేక రోడ్డు సర్వే నిమిత్తం రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా తదితర ప్రభుత్వ శాఖల నుండి సమాచారాన్ని తీసుకోవాలని, సర్వే చేస్తున్నప్పుడు వ్యాపారవేత్తలు ఏ విధంగానూ అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

ప్రతికూల వృద్ధిని చూపుతున్న టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్స్, పామ్ ఆయిల్, రెస్టారెంట్లు తదితర రంగాలపై దృష్టి పెట్టాలని, ఈ క్రమంలో ఆన్‌లైన్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, పోర్టుల నుండి దిగుమతి డేటా తదితర వనరులతో ఈ సంస్ధల టర్నోవర్‌ను క్రాస్ చెక్ చేయాలన్నారు. పన్ను బకాయిలు వసూలు చేయడానికి జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవచ్చని, బడ్జెట్ అంచనాలలో పేర్కొన్న లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యాలను సాధించడంలో లోటు ఏర్పడితే అది రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

More Press Releases