సిబ్బంది సమయపాలన పాటించాలి: వీఎంసీ క‌మిష‌న‌ర్

Related image

  • సచివాలయ ఉద్యోగుల సేవలు ప్రజలకు అందుబాటు ఉండాలి
విజయవాడ: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ సూచించారు. శనివారం 36వ డివిజన్ హనుమాన్ పేటలో డా.జంద్యాల దక్షిణమూర్తి మునిసిపల్ హైస్కూల్ నందలి 193 & 195 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్లను పరిశీలించారు.

సచివాలయ ఉద్యోగులు ప్రవర్తనా నియమావళిని తప్పని సరిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవలను అందించే మంచి అవకాశం సచివాలయ ఉద్యోగులకు లభిస్తున్నదన్నారు. తమ విధులు, బాధ్యతలను పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉద్యోగుల హాజరు పట్టిక మరియు సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చు దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పశువులను రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు: కమీషనర్ ప్రసన్న వెంకటేష్

నగరంలో పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదలడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం అర్దరాత్రి కృష్ణలంక ప్రాంతములో రోడ్లుపై సంచరిస్తూ ప్రజలకు, పారిశుధ్య నిర్వహణకు అవరోధం కలిగిస్తూ తిరుగుతున్నా 50 ఆవులు మరియు ఆవు దూడలను నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీన పరచుకొని ఆర్.ఆర్.పేటలోని క్యాటిల్ షెడ్ లో పెట్టడం జరిగింద‌న్నారు.

ఆవుల యజమానులు అందరు తమ తమ ఆవులను ఐదు రోజులలోగా అపరాధ రుసుము చెల్లించి, అఫ్ఫివిట్ లను సమర్పించి ఆవులను తీసుకోని మీ స్వంత స్థలములో కట్టుకోనవలెనని కమిషనర్ ఆదేశించారు. నిర్ధేశించిన‌ గడువు లోపల ఆవులను తీసుకోని వెళ్ళనిచో సదరు ఆవులను నగరపాలక సంస్థ వారు డి.ఆర్.డి.ఏ వారికీ అప్పగించుట జరుగుతుందని పేర్కొన్నారు. 

More Press Releases